Telugu Global
Cinema & Entertainment

శ్రీ‌శ్రీ కోసం మ‌హేష్ వాయిస్ !

ఫాలోయింగ్ వున్న హీరోలు ఏది చేసినా ఎగ్జైటింగా వుంటుంది అభిమానులకు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు ..ప‌వ‌న్ క‌ళ్యాణ్ లది అదే ప‌రిస్థితి. వాళ్లు ఏది చేసినా ఫ్యాన్స్ కు సంబ‌ర‌మే. ఈ మధ్య కాలంలో వాయిస్ ఓవ‌ర్ లతో సినిమా ఓపెన్ అవుతుండ‌టం సాధారణ విషయం అయిపోయింది. అయితే వాయిస్ ఓవ‌ర్ మ‌హేష్ బాబు లాంటి వాడు చెబితే.. ఆ రేంజ్ వేరు. గతంలో జ‌ల్సా, బాద్ షా చిత్రాల‌కు మ‌హేష్ బాబు తో వాయిస్ ఓవ‌ర్ […]

శ్రీ‌శ్రీ కోసం మ‌హేష్ వాయిస్ !
X

ఫాలోయింగ్ వున్న హీరోలు ఏది చేసినా ఎగ్జైటింగా వుంటుంది అభిమానులకు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు ..ప‌వ‌న్ క‌ళ్యాణ్ లది అదే ప‌రిస్థితి. వాళ్లు ఏది చేసినా ఫ్యాన్స్ కు సంబ‌ర‌మే. ఈ మధ్య కాలంలో వాయిస్ ఓవ‌ర్ లతో సినిమా ఓపెన్ అవుతుండ‌టం సాధారణ విషయం అయిపోయింది. అయితే వాయిస్ ఓవ‌ర్ మ‌హేష్ బాబు లాంటి వాడు చెబితే.. ఆ రేంజ్ వేరు. గతంలో జ‌ల్సా, బాద్ షా చిత్రాల‌కు మ‌హేష్ బాబు తో వాయిస్ ఓవ‌ర్ చెప్పించారు. అది బాగా క్లిక్ అయ్యింది .

ఇక తాజాగా సూప‌ర్ స్టార్ కృష్ణ‌, ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య నిర్మ‌ల లీడ్ రోల్స్ లో శ్రీ‌శ్రీ పేరు తో ద‌ర్శ‌కుడు ముప్ప‌ల‌నేని శివ ఒక చిత్రం చేస్తున్నారు. విడుద‌ల‌కు సిద్ద‌మైన ఈ చిత్రంలో మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ ఉంద‌ట‌. మ‌హేష్ వాయిస్ ఓవ‌ర్ తోనే సినిమా స్టోరి ప్రారంభం అవుతుంద‌ట‌. మ‌రి తండ్రి హీరోగా వున్న చిత్రాల్లో మ‌హేష్ బాల‌న‌టుడిగా ఓన‌మాలు దిద్దుకుని.. ఇప్పుడు ఒక స్టార్ గా తండ్రి న‌టించిన సినిమాకు వాయిస్ ఓవ‌ర్ చెప్ప‌డం అనేది అభిమానుల‌కు ఒక విశేష‌మే . ఈ చిత్రంలో కృష్ణ గారి అల్లుడు సుధీర్ బాబు గెస్ట్ రోల్ చేశారు. త్వ‌ర‌లో శ్రీ‌శ్రీ చిత్రం రిలీజ్ కానుంది మ‌రి.

First Published:  2 March 2016 11:49 PM GMT
Next Story