Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి మిడిల్ డ్రాప్

ఇప్పటికే చిరంజీవి ఒకసారి మిడిల్ డ్రాప్ అయ్యాడు. అంతా సెట్ అయిపోయిందనుకున్న టైమ్ కు పూరి జగన్నాధ్ రాసుకున్న ఆటోజానీ ప్రాజెక్టు నుంచి సైడైపోయాడు. ఇప్పుడు తాజాగా మరోసారి మెగాస్టార్ మిడిల్ డ్రాప్ అయ్యాడు. తమిళనాట హిట్టయిన కత్తి సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చిరు రెడీ అయ్యాడు. ఆ ప్రాజెక్టును వీవీ వినాయక్ చేతిలో పెట్టాడు కూడా. త్వరలోనే అది పట్టాలపైకి వస్తుందని అంతా అనుకుంటున్నారు. కాకపోతే కూతురు శ్రీజ పెళ్లి కోసం కత్తి రీమేక్ […]

చిరంజీవి మిడిల్ డ్రాప్
X
ఇప్పటికే చిరంజీవి ఒకసారి మిడిల్ డ్రాప్ అయ్యాడు. అంతా సెట్ అయిపోయిందనుకున్న టైమ్ కు పూరి జగన్నాధ్ రాసుకున్న ఆటోజానీ ప్రాజెక్టు నుంచి సైడైపోయాడు. ఇప్పుడు తాజాగా మరోసారి మెగాస్టార్ మిడిల్ డ్రాప్ అయ్యాడు. తమిళనాట హిట్టయిన కత్తి సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చిరు రెడీ అయ్యాడు. ఆ ప్రాజెక్టును వీవీ వినాయక్ చేతిలో పెట్టాడు కూడా. త్వరలోనే అది పట్టాలపైకి వస్తుందని అంతా అనుకుంటున్నారు. కాకపోతే కూతురు శ్రీజ పెళ్లి కోసం కత్తి రీమేక్ ప్రాజెక్టును కొన్ని నెలలు వాయిదా వేశాడు చిరు. అయితే ఇది అసలై మిడిల్ డ్రాప్ కాదు.
టోటల్ గా సినిమా నుంచి చిరంజీవి తప్పుకున్నట్టు చెబుతున్నారు. కత్తి రీమేక్ కు వినాయక్ అండ్ టీం చేసిన మార్పులు చిరంజీవికి నచ్చలేదట. పైగా… సన్నిహితులు ఇచ్చిన సూచనల మేరకు రీమేక్ చేయకూడదని ప్రాధమికంగా నిర్ణయానికొచ్చాడట. వీటితో పాటు… అఖిల్ సినిమా ఫ్లాప్ తర్వాత తిరిగి తన 150వ సినిమాను వినాయక్ చేతిలో పెట్టడానికి చిరు మనసు ఒప్పుకోవడం లేదట. ఈ సమీకరణాలన్నీ లెక్కలోకి తీసుకొని…. కత్తి రీమేక్ నుంచి సైడై పోవాలని చిరు భావిస్తున్నాడట.
First Published:  23 Feb 2016 7:22 AM GMT
Next Story