Telugu Global
Cinema & Entertainment

సమ్మర్ రేస్ నుంచి సైడైపోయిన వెంకీ

 కొన్ని అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి… మన ప్రమేయం లేకుండానే సినిమాలు వాయిదా పడిపోతుంటాయి. ఈ విషయం వెంకీకి ఇప్పుడు తెలిసొచ్చింది. మారుతి దర్శకత్వంలో వెంకటేష్ చేస్తున్న బాబు బంగారం సినిమా చాలా ఆలస్యమౌతోందనే విషయాన్ని తెలుగుగ్లోబల్.కామ్ ఎప్పుడో చెప్పింది. హీరోయిన్ నయనతార సినిమా యూనిట్ కు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో… షూటింగ్ ఆలస్యమే… సినిమా విడుదల అనుకున్న టైమ్ కు జరగకపోవచ్చని అప్పుడే చెప్పాం. అదే ఇప్పుడు నిజమైంది… నయనతార సకాలంలో అందుబాటులోకి రాకపోవడంతో.. బాబు బంగారం […]

సమ్మర్ రేస్ నుంచి సైడైపోయిన వెంకీ
X
కొన్ని అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి… మన ప్రమేయం లేకుండానే సినిమాలు వాయిదా పడిపోతుంటాయి. ఈ విషయం వెంకీకి ఇప్పుడు తెలిసొచ్చింది. మారుతి దర్శకత్వంలో వెంకటేష్ చేస్తున్న బాబు బంగారం సినిమా చాలా ఆలస్యమౌతోందనే విషయాన్ని తెలుగుగ్లోబల్.కామ్ ఎప్పుడో చెప్పింది. హీరోయిన్ నయనతార సినిమా యూనిట్ కు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో… షూటింగ్ ఆలస్యమే… సినిమా విడుదల అనుకున్న టైమ్ కు జరగకపోవచ్చని అప్పుడే చెప్పాం. అదే ఇప్పుడు నిజమైంది… నయనతార సకాలంలో అందుబాటులోకి రాకపోవడంతో.. బాబు బంగారం సినిమాను సమ్మర్ రేసు నుంచి తప్పించారు.
రీసెంట్ గా నయనతారతో చర్చలు జరిపిన సినిమా యూనిట్… ఆమె కాల్షీట్లు దగ్గర్లో అందుబాటులో లేకపోవడంతో… సినిమాను జులైకు వాయిదా వేసుకున్నాయి. లక్ష్మి, తులసి లాంటి సూపర్ హిట్స్ తర్వాత…. వెంకీ-నయన కలిసి నటించాల్సిన సినిమా బాబు బంగారం. అందుకే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. సమ్మర్ రేసులో పవన్, మహేష్ లాంటి స్టార్ హీరోలతో పోటీగా ఇది కూడా వస్తుందని అంతా అనుకున్నారు. కానీ వెంకీ సినిమా ఈ వేసవికి రావడం లేదు.
First Published:  23 Feb 2016 7:26 AM GMT
Next Story