Telugu Global
Cinema & Entertainment

స‌రైనోడు పాట‌కు ఒక‌టిన్న‌ర కోట్ల సెట్టు...బాలివుడ్ కొరియోగ్రాఫ‌ర్లు!

బోయ‌పాటి శ్రీను ద‌ర్శక‌త్వంలో అల్లు అర్జున్ న‌టిస్తున్న స‌రైనోడు సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా తాలూకూ ఒక పాట చిత్రీక‌ర‌ణ‌కోసం అన్న‌పూర్ణ స్టూడియోలో ఒక‌టిన్న‌ర కోట్లు ఖ‌ర్చుపెట్టి భారీ సెట్‌ని వేశారు. ఈ పాట‌లో 300మంది డ్యాన్స‌ర్లు అల్లు అర్జున్‌, కేథ‌రిన్‌ల‌తో క‌లిసి ఆడ‌నున్నారు. అంతేకాదు, ఈ పాట‌కు మ‌రో విశేషం కూడా ఉంది. బాలివుడ్ కొరియోగ్రాఫ‌ర్లు బాస్కో, సీజ‌ర్‌లు నృత్య‌రీతులు స‌మ‌కూర్చారు. ఈ సాంగ్  సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. […]

స‌రైనోడు పాట‌కు ఒక‌టిన్న‌ర కోట్ల సెట్టు...బాలివుడ్ కొరియోగ్రాఫ‌ర్లు!
X

బోయ‌పాటి శ్రీను ద‌ర్శక‌త్వంలో అల్లు అర్జున్ న‌టిస్తున్న స‌రైనోడు సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా తాలూకూ ఒక పాట చిత్రీక‌ర‌ణ‌కోసం అన్న‌పూర్ణ స్టూడియోలో ఒక‌టిన్న‌ర కోట్లు ఖ‌ర్చుపెట్టి భారీ సెట్‌ని వేశారు. ఈ పాట‌లో 300మంది డ్యాన్స‌ర్లు అల్లు అర్జున్‌, కేథ‌రిన్‌ల‌తో క‌లిసి ఆడ‌నున్నారు. అంతేకాదు, ఈ పాట‌కు మ‌రో విశేషం కూడా ఉంది. బాలివుడ్ కొరియోగ్రాఫ‌ర్లు బాస్కో, సీజ‌ర్‌లు నృత్య‌రీతులు స‌మ‌కూర్చారు. ఈ సాంగ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. స‌రైనోడు సినిమాలో అల్లు అర్జున్ పోలీస్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కేథ‌రిన్ ఎమ్మెల్యే రోల్ చేస్తుండ‌గా ఆమెకు బాడీగార్డ్‌గా కూడా క‌నిపిస్తాడు. మెయిన్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఈ సినిమా టీజ‌ర్‌ని నేడు విడుద‌ల చేస్తున్నారు. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గీతా బ్యాన‌ర్‌లో అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

First Published:  18 Feb 2016 12:33 AM GMT
Next Story