Telugu Global
CRIME

ప్రేమికుల‌రోజు పార్టీ...రేప్‌తో ముగిసింది!

పుణెలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేస్తున్న 26ఏళ్ల యువ‌తి దారుణ‌మైన రేప్‌కి గుర‌యింది. పైగా,  ఆమె స్వ‌యంగా ఇచ్చిన పార్టీకి వ‌చ్చిన వ్య‌క్తే ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. బాధితురాలు మ‌రో ముగ్గురు కొలీగ్స్‌తో క‌లిసి అమ‌నోరా పార్క్ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. కోల్‌క‌తాకు చెందిన ఆమె రెండేళ్లుగా  ఒక మ‌ల్టీనేష‌న‌ల్  సాఫ్ట్‌వేర్ కంపెనీలో అసిస్టెంటు మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తోంది.  వాలెంటైన్స్‌డే నాడు ఆ ముగ్గురు క‌లిసి త‌మ స్నేహితుల‌కు పార్టీ ఇవ్వాల‌ని అనుకున్నారు. అయితే నిందితుడిని బాధితురాలు […]

ప్రేమికుల‌రోజు పార్టీ...రేప్‌తో ముగిసింది!
X

పుణెలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేస్తున్న 26ఏళ్ల యువ‌తి దారుణ‌మైన రేప్‌కి గుర‌యింది. పైగా, ఆమె స్వ‌యంగా ఇచ్చిన పార్టీకి వ‌చ్చిన వ్య‌క్తే ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. బాధితురాలు మ‌రో ముగ్గురు కొలీగ్స్‌తో క‌లిసి అమ‌నోరా పార్క్ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. కోల్‌క‌తాకు చెందిన ఆమె రెండేళ్లుగా ఒక మ‌ల్టీనేష‌న‌ల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అసిస్టెంటు మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తోంది. వాలెంటైన్స్‌డే నాడు ఆ ముగ్గురు క‌లిసి త‌మ స్నేహితుల‌కు పార్టీ ఇవ్వాల‌ని అనుకున్నారు. అయితే నిందితుడిని బాధితురాలు నేరుగా పార్టీకి ఆహ్వానించ‌లేదు. త‌న స్నేహితురాలి త‌ర‌పున వ‌చ్చిన హ‌నీఫ్‌తో పాటు నిందితుడైన‌ ఫిరోజ్ మ‌హ‌మ్మ‌ద్ షైక్(23) కూడా పార్టీకి వ‌చ్చాడు.

ఫిరోజ్, బాధితురాలికి త‌న జిమ్ కోచ్‌గా తెలుసు. తెల్ల‌వారుజామున రెండున్న‌ర వ‌ర‌కు పార్టీ జ‌రిగింది. బాగా పొద్దుపోవ‌డంతో, పైగా ఆల్క‌హాల్ ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల‌న హ‌నీఫ్‌, ఫిరోజ్ అక్క‌డే ఉండిపోయారు. అంద‌రూ నిద్ర‌పోయిన స‌మ‌యంలో ఫిరోజ్ ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. తాను గ‌ట్టిగా కేక‌లు వేసినా గాఢ‌నిద్ర‌లో ఉండ‌టంతో త‌న స్నేహితులు లేవ‌లేద‌ని ఆమె పోలీసుల విచార‌ణ‌లో తెలిపింది. అయితే అత్యాచారం త‌రువాత కూడా, అత‌ను చంపేస్తాడేమో అనే భ‌యంతో చాలాసేపు ఆమె కామ్‌గా ఉండిపోయింది. అత‌ను బ‌య‌ట‌కు వెళ్లాక పోలీసుల‌కు కాల్‌చేసి చెప్పింది. హ‌డ‌స్ప‌ర్ పోలీస్ స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ నిందితుడిని అరెస్టు చేసి అత‌నిపై ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ సెక్ష‌న్ 376 ప్ర‌కారం రేప్ కేసుని న‌మోదు చేశారు.

First Published:  16 Feb 2016 2:57 AM GMT
Next Story