Telugu Global
Cinema & Entertainment

మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ...?

ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్న మహేష్ బాబు… ఆ సినిమా విడుదల కాకముందే మురుగదాస్ దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. బ్రహ్మోత్సవం సినిమా ఏప్రిల్ 29న విడుదలకానుండగా… అంతకంటే ముందే ఏప్రిల్ 14న మురుగదాస్ సినిమాను పట్టాలపైకి తీసుకొస్తున్నాడు మహేష్. ఈ సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయింది. ఒక్క హీరోయిన్ సెలక్షన్ తప్ప. మొన్నటివరకు టాలీవుడ్ భామల కోసం వెదికిన మురుగుదాస్ ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ పై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం […]

మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ...?
X
ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్న మహేష్ బాబు… ఆ సినిమా విడుదల కాకముందే మురుగదాస్ దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. బ్రహ్మోత్సవం సినిమా ఏప్రిల్ 29న విడుదలకానుండగా… అంతకంటే ముందే ఏప్రిల్ 14న మురుగదాస్ సినిమాను పట్టాలపైకి తీసుకొస్తున్నాడు మహేష్. ఈ సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయింది. ఒక్క హీరోయిన్ సెలక్షన్ తప్ప. మొన్నటివరకు టాలీవుడ్ భామల కోసం వెదికిన మురుగుదాస్ ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ పై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం సోనాక్షి సిన్హాతో ఓ హిందీ సినిమా చేస్తున్న ఈ దర్శకుడు… మహేష్ మూవీ కోసం ఆమెనే రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. సోనాక్షీ కూడా ఒళ్లుతగ్గించి స్లిమ్ గా మారడం ఇక్కడ ప్లస్ పాయింట్. అయితే సోనాక్షికి పోటీ బాగానే ఉంది. మహేష్ సరసన నటించేందుకు పరిణీతి చోప్రీ, శ్రద్ధాకపూర్ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సోనాక్షి లానే పరిణీతి కూడా బాగా స్లిమ్ అయింది. ఇక శ్రద్ధాకపూర్ ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ ముగ్గురు భామల్లో మహేష్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.
Click on Image to Read:
kareena
brahmotsavam
varuntej
Sakshi-Agarwal-FI
First Published:  15 Feb 2016 9:05 PM GMT
Next Story