Telugu Global
International

ఉన్న‌దేవుడికోసం వందల‌ ఛాన‌ళ్లు...లేని దేవుడి కోసం ఒక‌టి!

దేవుడు, మ‌తం, న‌మ్మ‌కాలు, ఆచారాలు, సంప్ర‌దాయాలు ఇవ‌న్నీ పూర్తిగా వ్య‌క్తిగ‌త‌మైన వ్య‌వ‌హారాలుగా గుర్తించాల్సిన స‌మ‌యం ఎప్పుడో వ‌చ్చింది. అయినా మ‌నం ఈ విష‌యంలో వెనుక‌బ‌డే ఉంటున్నాం. పైన మ‌నం చెప్పుకున్న‌వ‌న్నీ మ‌నిషి, మ‌నిషిగా…అంటే ఇత‌రుల‌కు హానిక‌లిగించ‌ని రీతిలో, కాస్త మాన‌వ‌త్వంతో బ‌త‌క‌డం ఎలాగో తెలియ‌ని రోజుల్లో ఏర్పాటు చేసుకున్న‌వి. మ‌నిషి ఎదిగిన కొద్దీ వీటి అవ‌స‌రం త‌గ్గుతూ ఉంటుంది…ఉండాలి. కానీ విచిత్రం ఏమిటంటే…వ‌స్తువుల ఉత్ప‌త్తి, విద్య‌,  సైన్స్‌, సాంకేతిక‌త‌…ఇవ‌న్నీ పెరిగిన కొద్దీ ఆనాటి ఆ వ్య‌వ‌హారాలు కూడా […]

ఉన్న‌దేవుడికోసం వందల‌ ఛాన‌ళ్లు...లేని దేవుడి కోసం ఒక‌టి!
X

దేవుడు, మ‌తం, న‌మ్మ‌కాలు, ఆచారాలు, సంప్ర‌దాయాలు ఇవ‌న్నీ పూర్తిగా వ్య‌క్తిగ‌త‌మైన వ్య‌వ‌హారాలుగా గుర్తించాల్సిన స‌మ‌యం ఎప్పుడో వ‌చ్చింది. అయినా మ‌నం ఈ విష‌యంలో వెనుక‌బ‌డే ఉంటున్నాం. పైన మ‌నం చెప్పుకున్న‌వ‌న్నీ మ‌నిషి, మ‌నిషిగా…అంటే ఇత‌రుల‌కు హానిక‌లిగించ‌ని రీతిలో, కాస్త మాన‌వ‌త్వంతో బ‌త‌క‌డం ఎలాగో తెలియ‌ని రోజుల్లో ఏర్పాటు చేసుకున్న‌వి. మ‌నిషి ఎదిగిన కొద్దీ వీటి అవ‌స‌రం త‌గ్గుతూ ఉంటుంది…ఉండాలి. కానీ విచిత్రం ఏమిటంటే…వ‌స్తువుల ఉత్ప‌త్తి, విద్య‌, సైన్స్‌, సాంకేతిక‌త‌…ఇవ‌న్నీ పెరిగిన కొద్దీ ఆనాటి ఆ వ్య‌వ‌హారాలు కూడా పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈ క్లాష్‌ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించే సంఘ‌ట‌న‌లు, ప‌రోక్ష‌యుద్దాల్లాంటివి రోజూ మ‌న‌చుట్టూ జ‌రుగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో చేత‌బ‌డులు, దేశంలో ప‌ర‌మ‌త‌ అస‌హ‌నాలు, ప్ర‌పంచంలో ఐసిస్ ఉగ్ర‌వాదాలు…ఇలాంటివీ ఉన్నాయి…వీటిపై పోరూ ఇంకా ఉంది. అదే క్లాష్ అంటే.

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే దేవుడు అనే ఒక్క స‌బ్జ‌క్టుతోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా వంద‌ల సంఖ్య‌లో టివిచానళ్లు న‌డుస్తున్నాయి. ప్ర‌పంచంలో ప్ర‌తీ విష‌యానికీ ఒక విరుద్ధ‌మైన అంశం ఉండాలి కాబ‌ట్టి సైన్స్, టెక్నాల‌జీ సంబంధిత విష‌యాల‌పై ఉన్న ఛాన‌ళ్ల‌ను దేవుళ్ల చాన‌ళ్ల‌కు స‌రిగ్గా వ్య‌తిరేక‌మైన‌విగా భావించాలి. కానీ ముహుర్తాలు పెట్టి రాకెట్ల‌ను అంత‌రిక్షంలోకి పంపుతున్నాం కాబ‌ట్టి అలాకూడా చేయ‌లేము. అందుకే పూర్తిగా భ‌క్తిఛాన‌ళ్ల‌కు వ్య‌తిరేకంగా ఒక నాన్ భ‌క్తి ఛాన‌ల్ తేవాల‌ని అమెరికాలో ఒక నాస్తిక‌వాద సంస్థ అనుకుంటోంది. ఈ నాన్ భ‌క్తి ఛాన‌ల్ అమెరికాలో జులైలో ప్రారంభం కాబోతున్న‌ది. ఈ విశేషాల‌ను అమెరికా నాస్తికుల సంస్థ, అమెరిక‌న్ అఫీయిస్ట్స్ అధ్య‌క్షుడు డేవిడ్ సిల్వ‌ర్‌మేన్ వెల్ల‌డించాడు. దీనిపై అమెరికాలో నాస్తికవాదాన్ని స‌మ‌ర్థిస్తున్న‌వారు, ప్ర‌పంచాన్ని మ‌రింత విశాలంగా అర్థం చేసుకోవాల‌ని ఆశిస్తున్నారు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అయితే ఈ చాన‌ల్ స్థాప‌న వెనుక ఉన్న ఉద్దేశాన్ని చెబుతూ డేవిడ్‌, మ‌న ప‌రిమితుల‌ను దాటి ప్ర‌యాణం చేయ‌డానికే దీన్ని తెస్తున్నాం అన్నాడు. ఏదిఏమైనా 100 క్రైస్త‌వ టివి ఛాన‌ళ్లు, నాలుగు యూదుల ఛాన‌ళ్లు ఉన్న అమెరికాలో ఈ నాస్తిక‌వాద ఛాన‌ల్ ఏ మేర‌కు ప్ర‌జ‌ల్లోకి వెళుతుందో చూడాలి.

పిఎస్:

దేవుడికి వ్య‌తిరేకంగా మాట్లాడిన‌వారంతా నాస్తికులు అనుకోన‌క్క‌ర్లేదు. దేవుడు అనే భావ‌న‌కి ఇప్పుడున్న అర్థాన్ని, ప్ర‌చారాన్ని, అర్థ‌ర‌హిత‌మైన విధానాల‌ను వ్య‌తిరేకిస్తున్న‌వారూ అనుకోవ‌చ్చు. దైవానికి కొత్త నిర్వ‌చ‌నం ఇస్తున్న‌వారూ, ఇంకా అస‌లైన అర్థాన్ని వెతుక్కుంటున్న‌వారు కూడా కావ‌చ్చు.

First Published:  16 Feb 2016 1:05 AM GMT
Next Story