Telugu Global
Cinema & Entertainment

ర‌ణ్వీర్ కు నిరాశ కలిగించిన దీపిక‌

ప్ర‌స్తుతం బాలీవుడ్ ప్రేమ ప‌క్షుల్లో ర‌ణ్వీర్ సింగ్. ..దీపిక ప‌దుకోణ్ ల‌ది హాట్ క‌పుల్ అని చెప్పాలి. మీడియాకు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్ర‌మే అని చెబుతూ..రియ‌ల్ లైఫ్ లో ఒకరికి ఒక‌రు అన్న‌ట్లుంటున్న ఈ జోడి గ‌త యేడాది బాజీరావు మ‌స్తానీ చిత్రంతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ను త‌మ ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా ర‌ణ్వీర్ సింగ్.. దీపిక ప‌దుకోణ్ ల యాక్టింగ్ కు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది.ఇక దీపిక ప్ర‌స్తుతం ట్రిపుల్ ఎక్స్ అనే […]

ర‌ణ్వీర్  కు నిరాశ కలిగించిన దీపిక‌
X

ప్ర‌స్తుతం బాలీవుడ్ ప్రేమ ప‌క్షుల్లో ర‌ణ్వీర్ సింగ్. ..దీపిక ప‌దుకోణ్ ల‌ది హాట్ క‌పుల్ అని చెప్పాలి. మీడియాకు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్ర‌మే అని చెబుతూ..రియ‌ల్ లైఫ్ లో ఒకరికి ఒక‌రు అన్న‌ట్లుంటున్న ఈ జోడి గ‌త యేడాది బాజీరావు మ‌స్తానీ చిత్రంతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ను త‌మ ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా ర‌ణ్వీర్ సింగ్.. దీపిక ప‌దుకోణ్ ల యాక్టింగ్ కు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది.ఇక దీపిక ప్ర‌స్తుతం ట్రిపుల్ ఎక్స్ అనే సినిమా సీక్వెల్ లో హీరోయిన్ గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే వాలెంటైన్స్ డే రోజు ర‌ణ్వీర్ సింగ్..త‌న మాన‌స చోరిణిని చూడ‌కుండ‌.. క‌ల‌వ‌కుండ వుండ‌లేక పోయాడు. దీపిక త‌న హాలీవుడ్ ఫిల్మ్ షూటింగ్ నిమిత్తం కెన‌డాలో వుంది. దీంతో ప్రేమికుల రోజు దీపిక ను క‌ల‌వ‌డానికి ర‌ణ్వీర్ సింగ్.. కెన‌డ వెళ్లాడ‌ట‌. దీపిక త‌న క్లోజ్ ప్రెండ్ ను ట్రిపుల్ ఎక్స్ ఫిల్మ్ యూనిట్ కు ప‌రిచ‌యం చేసింద‌ట‌. అంతా బాగానే ఉంది కానీ.. దీపిక తో టైమ్ స్పెండ్ చేయాల‌ని అంత దూరం వెళ్లిన ర‌ణ్వీర్ సింగ్ కోరిక నెర‌వేర‌లేద‌ట‌. దీపిక షూటింగ్ లో బిజీ గా ఉండ‌టం వ‌ల‌న‌.. త‌న ప్రియుడితో ఈవెనింగ్ స్పెండ్ చేయ‌డానికి కుద‌ర‌లేద‌ట‌. మొత్తం మీద ర‌ణ్వీర్ కు ఇది కొంత నిరాశ క‌లిగించే అంశ‌మే అంటున్నారు.

First Published:  15 Feb 2016 10:29 AM GMT
Next Story