Telugu Global
Cinema & Entertainment

మెగా హీరో చేతిలో రెండు.... త్వరలోనే మరో రెండు

సుప్రీమ్ హీరో సాయిధర్మతేజ మాంచి ఊపుమీదున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుసపెట్టి సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో రెండు సినిమాలుండగా… త్వరలోనే మరో 2 సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం సుప్రీమ్, తిక్క సినిమాలు చేస్తున్నాడు సాయిధర్మతేజ. ఈ రెండూ కంప్లీట్ అయిన వెంటనే…. కన్నడ హిట్ సినిమా మిస్టర్ అండ్ మిసెస్ రామాచారిని తెలుగులో తెరకెక్కించనున్నాడు. దీంతో పాటు వెంకీ అనే కొత్తకుర్రాడిని దర్శకుడిగా పరిచయం […]

మెగా హీరో చేతిలో రెండు.... త్వరలోనే మరో రెండు
X
సుప్రీమ్ హీరో సాయిధర్మతేజ మాంచి ఊపుమీదున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుసపెట్టి సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో రెండు సినిమాలుండగా… త్వరలోనే మరో 2 సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం సుప్రీమ్, తిక్క సినిమాలు చేస్తున్నాడు సాయిధర్మతేజ. ఈ రెండూ కంప్లీట్ అయిన వెంటనే…. కన్నడ హిట్ సినిమా మిస్టర్ అండ్ మిసెస్ రామాచారిని తెలుగులో తెరకెక్కించనున్నాడు. దీంతో పాటు వెంకీ అనే కొత్తకుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మరో సినిమా కూడా చేయబోతున్నాడు. సో… మొత్తంగా చూసుకుంటే సాయిధర్మతేజ చేతిలో ఏకంగా 4 ప్రాజెక్టులు ఉన్నట్టు లెక్క. ప్రస్తుతం సాయితో సుప్రీమ్ సినిమాను తెరకెక్కిస్తున్న నిర్మాత దిల్ రాజు… రాబోయే సినిమాల్లో కూడా ఒక మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించే అవకాశముంది.
First Published:  13 Feb 2016 1:37 AM GMT
Next Story