Telugu Global
Cinema & Entertainment

రమ్యకృష్ణకు మళ్లీ టైమొచ్చింది!

సినిమాల జ‌యాప‌జ‌యాల‌తో పాటు న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న‌ల్లో కూడా మార్పులు వ‌స్తుంటాయి. వ‌రుస‌గా రెండుసినిమాలు హిట్ట‌యితే త‌రువాత సినిమా పారితోష‌కాన్ని పెంచ‌నివారు ఉండ‌రు. దీనికి జూనియ‌ర్లు సీనియ‌ర్ల‌నే తేడా లేదు. ర‌మ్య కృష్ణ‌కు ఇప్పుడు అలాంటి మంచి టైమ్ న‌డుస్తోంది. హీరోయిన్‌గా ఉన్న‌పుడు ప్రేక్ష‌కులు ఆమెను ఎక్కువ‌గా గ్లామ‌ర‌స్ హీరోయిన్‌గానే చూశారు. కానీ క్యార‌క్ట‌ర్ యాక్ట‌ర్‌గా మారాక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమెకు, గ్లామ‌ర్‌కి మంచి న‌ట‌న తోడ‌య్యే పాత్ర‌లు వ‌స్తున్నాయి. బాహుబ‌లి షూటింగ్ స‌మ‌యంలో ర‌మ్య‌కృష్ణ త‌మ‌కు స్ఫూర్తిగా […]

రమ్యకృష్ణకు మళ్లీ టైమొచ్చింది!
X

సినిమాల జ‌యాప‌జ‌యాల‌తో పాటు న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న‌ల్లో కూడా మార్పులు వ‌స్తుంటాయి. వ‌రుస‌గా రెండుసినిమాలు హిట్ట‌యితే త‌రువాత సినిమా పారితోష‌కాన్ని పెంచ‌నివారు ఉండ‌రు. దీనికి జూనియ‌ర్లు సీనియ‌ర్ల‌నే తేడా లేదు. ర‌మ్య కృష్ణ‌కు ఇప్పుడు అలాంటి మంచి టైమ్ న‌డుస్తోంది. హీరోయిన్‌గా ఉన్న‌పుడు ప్రేక్ష‌కులు ఆమెను ఎక్కువ‌గా గ్లామ‌ర‌స్ హీరోయిన్‌గానే చూశారు. కానీ క్యార‌క్ట‌ర్ యాక్ట‌ర్‌గా మారాక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమెకు, గ్లామ‌ర్‌కి మంచి న‌ట‌న తోడ‌య్యే పాత్ర‌లు వ‌స్తున్నాయి. బాహుబ‌లి షూటింగ్ స‌మ‌యంలో ర‌మ్య‌కృష్ణ త‌మ‌కు స్ఫూర్తిగా నిలిచింద‌ని రాజమౌళే కితాబునిచ్చాడు. శివ‌గామి త‌రువాత సోగ్గాడే చిన్నినాయ‌న‌లో కూడా ర‌మ్య ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంది. ఈ రెండు సినిమాల విజ‌యాల ప్ర‌భావం ఇప్పుడు ర‌మ్య త‌దుప‌రి సినిమా రెమ్యున‌రేష‌న్ మీద ప‌డింది. ఇప్ప‌టివ‌ర‌కు సినిమాకు ఆమె 40 నుండి 80 ల‌క్ష‌ల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్నారు. అయితే త‌న భ‌ర్త కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్న రుద్రాక్ష హార‌ర్ ఫాంటసీ చిత్రం కోసం ఏకంగా కోటి డిమాండ్ చేసింద‌ట‌. రుద్రాక్ష‌లో ర‌మ్య‌కృష్ణ నెగెటివ్ రోల్ చేస్తున్నారు. గ్రాఫిక్స్‌ స‌న్నివేశాల‌న్నీ ఈ పాత్ర చిత్ర‌ణ‌లోనే ఉంటాయ‌ని స‌మాచారం.

First Published:  10 Feb 2016 10:44 PM GMT
Next Story