Telugu Global
Cinema & Entertainment

నానీ వ‌ర్సెస్ ఆది..

ఈ వారం ఇద్ద‌రు యువ హీరోలు పోటి ప‌డ‌తున్నారు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అంటూ నానీ వ‌స్తుండ‌గా… గ‌రం అంటూ యువ హీరో ఆది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న ల‌క్ ను టెస్ట్ చేసుకోవ‌డానికి వ‌స్తున్నారు. గ‌త యేడాది భ‌లే భ‌లే మ‌గాడివోయ్ అనే చిత్రంతో నానీ బాక్సాఫీస్ సూప‌ర్ హిట్ ను అందుకున్నాడు. దీంతో రెమ్యునరేష‌న్ కూడా పెంచేశాడు. ప్ర‌స్తుతం 14 రీల్స్ బ్యాన‌ర్ లో హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ష‌న్ లో కృష్ణ‌గాడి […]

నానీ వ‌ర్సెస్ ఆది..
X

ఈ వారం ఇద్ద‌రు యువ హీరోలు పోటి ప‌డ‌తున్నారు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అంటూ నానీ వ‌స్తుండ‌గా… గ‌రం అంటూ యువ హీరో ఆది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న ల‌క్ ను టెస్ట్ చేసుకోవ‌డానికి వ‌స్తున్నారు. గ‌త యేడాది భ‌లే భ‌లే మ‌గాడివోయ్ అనే చిత్రంతో నానీ బాక్సాఫీస్ సూప‌ర్ హిట్ ను అందుకున్నాడు. దీంతో రెమ్యునరేష‌న్ కూడా పెంచేశాడు. ప్ర‌స్తుతం 14 రీల్స్ బ్యాన‌ర్ లో హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ష‌న్ లో కృష్ణ‌గాడి వీర ప్రేమ గాధ అనే చిత్రం చేశాడు. ఈ సినిమా కూడా బిజినెస్ ప‌రంగా బాగా చేసింది. రిలీజ్ కు ముందే మంచి బిజినెస్ జ‌రగ‌డం అంటే సినిమా పై అంచ‌నాలు ఉన్న‌ట్లే లెక్క.

క‌ట్ చేస్తే హీరో ఆదికి మాత్రం ఒక హిట్ అవ‌స‌రం. కెరీర్ ప‌రంగా అత‌నికి ఇంకా బ్రేక్ రాలేదు. గ‌త యేడాది చేసిన ర‌ఫ్ చిత్రం అంత‌గా ఇంప్రెస్ చేయ‌లేదు. గ‌ర‌మ్ చిత్రం సాయికుమార్ నిర్మించారు. అంటే కొడుకు కోసం .. తండ్రి నిర్మాత‌గా మారాడు అన్న‌మాట‌. ద‌ర్శకత్వం మ‌ద‌న్ చేశారు. మంచి క‌థ తో వ‌స్తున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రి వీరిద్ద‌రిలో ఎవ‌రు ఈ వారం బాక్సాఫీస్ ను కొల్ల‌గొడ‌తారో చూద్దాం

First Published:  10 Feb 2016 12:59 AM GMT
Next Story