Telugu Global
Cinema & Entertainment

జోరు మీదున్న శివగామి

ఒక్క ఐడియా లైఫ్ ను మార్చేస్తుంది అన్న‌ట్లు. ఒక్క మంచి రోల్.. కెరీర్ ను వేగ‌వంతం చేస్తుంది అన‌డానికి బాహుబ‌లి చిత్రంలో ర‌మ్య‌కృష్ణ చేసిన శివ‌గామి రోలే ఎగ్జాంపుల్. ఈ చిత్రంలో అత్యంత ప్రాధాన్య‌త వున్న రోల్ ను అద్భుతుంగా పండించ‌టంతో.. అదే త‌ర‌హాలో ర‌మ్య‌కృష్ణ కు ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. సంక్రాంతి పండ‌గ‌కు నాగార్జున కాంబినేష‌న్ లో చేసిన సొగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రం లో కూడ స‌త్య‌భామ రోల్ బాగా పండ‌టంతో.. ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ణ త‌న […]

జోరు మీదున్న శివగామి
X

ఒక్క ఐడియా లైఫ్ ను మార్చేస్తుంది అన్న‌ట్లు. ఒక్క మంచి రోల్.. కెరీర్ ను వేగ‌వంతం చేస్తుంది అన‌డానికి బాహుబ‌లి చిత్రంలో ర‌మ్య‌కృష్ణ చేసిన శివ‌గామి రోలే ఎగ్జాంపుల్. ఈ చిత్రంలో అత్యంత ప్రాధాన్య‌త వున్న రోల్ ను అద్భుతుంగా పండించ‌టంతో.. అదే త‌ర‌హాలో ర‌మ్య‌కృష్ణ కు ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. సంక్రాంతి పండ‌గ‌కు నాగార్జున కాంబినేష‌న్ లో చేసిన సొగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రం లో కూడ స‌త్య‌భామ రోల్ బాగా పండ‌టంతో.. ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ణ త‌న స‌మకాలీన న‌టీ మ‌ణుల‌కంటే చాల బిజీగా ఉంది.

త‌న భ‌ర్త కృష్ణ వంశీ…రుద్రాక్ష అనే ఒక వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం దిల్ రాజ్ బ్యాన‌ర్ లో చేస్తున్న విష‌యం తెలిసిందే.ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ ఆత్మ గా క‌నిపించ‌నుంద‌ట‌. ఆమే గెట‌ప్ చూస్తే భ‌య పెట్టే విధంగా ఉంటుందంటున్నారు. సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో ఇప్ప‌టికే ఒక లుక్ వున్న పోస్ట‌ర్ ను హ‌ల్ చేస్తుంది. మొత్తం మీద ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు కీ రోల్స్ కి కేరాఫ్ గా మారింద‌న‌డంలో సందేహాం లేదు మ‌రి.

First Published:  9 Feb 2016 3:25 AM GMT
Next Story