Telugu Global
Cinema & Entertainment

తండ్రి పాత్ర‌లో… మేన‌మామ‌..!

నాగ‌ చైత‌‌న్య తాజా చిత్రం మ‌జ్నులో అత‌ని తండ్రిగా మేనమామ వెంక‌టేష్ న‌టిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. మ‌ళ‌యాల సూప‌ర్ హిట్ మూవీ ప్రేమ‌మ్ ఆధారంగా దీన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో వెంక‌టేష్ ఫుల్‌లెంగ్త్ పాత్ర‌లో కాకుండా గెస్ట్ అప్పీయ‌రెన్స్‌గా క‌నిపించ‌నున్నారు. నాగార్జున కూడా ఒక అతిథి పాత్ర‌లో మ‌జ్నులో న‌టిస్తున్నారు. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దీని ద‌ర్శ‌కుడు. శ్రుతిహాస‌న్‌తో పాటు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డొన్నా స‌బాష్టియ‌న్ హీరోయిన్లుగా అల‌రించ‌నున్నారు.  నాగ్, వెంకీ ఇద్ద‌రూ ఇందులో […]

తండ్రి పాత్ర‌లో… మేన‌మామ‌..!
X

నాగ‌ చైత‌‌న్య తాజా చిత్రం మ‌జ్నులో అత‌ని తండ్రిగా మేనమామ వెంక‌టేష్ న‌టిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. మ‌ళ‌యాల సూప‌ర్ హిట్ మూవీ ప్రేమ‌మ్ ఆధారంగా దీన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో వెంక‌టేష్ ఫుల్‌లెంగ్త్ పాత్ర‌లో కాకుండా గెస్ట్ అప్పీయ‌రెన్స్‌గా క‌నిపించ‌నున్నారు. నాగార్జున కూడా ఒక అతిథి పాత్ర‌లో మ‌జ్నులో న‌టిస్తున్నారు. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దీని ద‌ర్శ‌కుడు. శ్రుతిహాస‌న్‌తో పాటు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డొన్నా స‌బాష్టియ‌న్ హీరోయిన్లుగా అల‌రించ‌నున్నారు.

నాగ్, వెంకీ ఇద్ద‌రూ ఇందులో అతిథిపాత్ర‌ల్లోనే క‌నిపించినా, ఇద్ద‌రూ క‌లిసి న‌టించ‌డం ఇదే మొద‌టి సారి. నాగ‌చైత‌న్య వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని స‌మాచారం. ఇంత‌కుముందు 1980ల చివ‌ర్లో మ‌ణిర‌త్నం త‌మిళ హిట్ సినిమా అగ్ని న‌క్ష‌త్రం రీమేక్‌లో ఈ ఇద్ద‌రు హీరోలు క‌లిసి న‌టించాల్సి ఉంది. కానీ అది కార్య‌రూపం దాల్చ‌లేదు. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు చైతు వ‌ల‌న నాగార్జున, వెంక‌టేష్‌లు క‌లిసి తెర‌మీద క‌నిపించ‌నున్నారు. అదీ చైతూతో క‌లిసి. ఈ ఇద్ద‌రు సీనియ‌ర్లు, త‌మ కుటుంబంలోని జూనియ‌ర్‌కి ఈ సినిమా ప‌రంగా ఎంత‌వ‌ర‌కు ప్ల‌స్ అవుతారో వేచి చూడాలి. మ‌జ్నుని జులై 7న విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు.

First Published:  8 Feb 2016 2:28 AM GMT
Next Story