Telugu Global
National

మెడికల్‌ సీట్ల అక్రమాలకు తెరవేయనున్న కేంద్రం

కేంద్రప్రభుత్వం ఆశిస్తున్నట్లు జరిగితే దేశంలోని మూడు వందల మెడికల్‌ కాలేజీల్లోని సుమారు 32,000 ఎం.బి.బి.యస్‌ సీట్లకు 2017 సంవత్సరం నుంచి ఒకే ఎంట్రెన్స్‌ టెస్ట్‌ జరగనుంది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (యం.సి.ఐ) గత అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ దేశంలోని మెడికల్‌ కాలేజీల్లో సీట్లకోసం సుమారు 92 ఎంట్రెన్స్‌ పరీక్షలు జరుగుతున్నాయని, వీటిలో కొన్ని పరీక్షలను ప్రభుత్వాలు నిర్వహిస్తుండగా, కొన్ని ఎంట్రెన్స్‌ పరీక్షలను ప్రైవేట్‌ కాలేజీలు, డీమ్డ్‌ యూనివర్శిటీలు నిర్వహిస్తున్నాయని, ప్రైవేట్‌ కాలేజీల్లో […]

మెడికల్‌ సీట్ల అక్రమాలకు తెరవేయనున్న కేంద్రం
X

కేంద్రప్రభుత్వం ఆశిస్తున్నట్లు జరిగితే దేశంలోని మూడు వందల మెడికల్‌ కాలేజీల్లోని సుమారు 32,000 ఎం.బి.బి.యస్‌ సీట్లకు 2017 సంవత్సరం నుంచి ఒకే ఎంట్రెన్స్‌ టెస్ట్‌ జరగనుంది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (యం.సి.ఐ) గత అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ దేశంలోని మెడికల్‌ కాలేజీల్లో సీట్లకోసం సుమారు 92 ఎంట్రెన్స్‌ పరీక్షలు జరుగుతున్నాయని, వీటిలో కొన్ని పరీక్షలను ప్రభుత్వాలు నిర్వహిస్తుండగా, కొన్ని ఎంట్రెన్స్‌ పరీక్షలను ప్రైవేట్‌ కాలేజీలు, డీమ్డ్‌ యూనివర్శిటీలు నిర్వహిస్తున్నాయని, ప్రైవేట్‌ కాలేజీల్లో నిర్వహించే పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ప్రభుత్వానికి నివేదించింది. ప్రతి ఏడాది మెడిసిన్‌లో ప్రవేశాలకోసం విద్యార్ధులు దేశంలో అనేక చోట్ల అనేక పరీక్షలు రాయాల్సివస్తుందని, విద్యార్ధులపై ఈ భారాన్ని తగ్గించడానికి, అందరికి సమాన అవకాశాలు కల్పించడానికి దేశంలోని మొత్తం విద్యార్ధులందరికి ఒకే ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తే మంచిదని తెల్పింది.

దేశంలోని 13,000 పోస్టుగ్రాడ్యుయేట్‌ సీట్లకు కూడా దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహిస్తే మంచిదని సిఫార్సుచేసింది. యం.సి.ఐ చేసిన ఈ సూచనలు కేంద్రప్రభుత్వానికి నచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వచ్చే ఏడాది నుంచి ఎం.బి.బి.యస్‌, పోస్టుగ్రాడ్యుయేట్‌ సీట్లకోసం దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించడానికి క్యాబినేట్‌ అనుమతి కోరుతూ నోట్‌ తయారుచేసింది. న్యాయశాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ ప్రతిపాదనలను ఆమోదించాక ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ (1956)కు సవరణచేసి 2017నుంచి దేశానికి అంతటికి కలిపి ఒకే ఎంట్రెన్స్‌ టెస్ట్‌ జరిగే అవకాశం ఉంది.

First Published:  8 Feb 2016 1:44 AM GMT
Next Story