Telugu Global
NEWS

జగన్‌ నిర్ణయం వల్లే ఈ సంబరాలు

గ్రేటర్‌ ఎన్నికల్లో ఒక్క టీఆర్‌ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ దెబ్బతిన్నాయి.  అయితే ఈ ఫలితాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్న పార్టీ టీడీపీ. అదే సమయంలో సంబరాలు చేసుకుంటున్న వారిలో టీఆర్ఎస్‌తో పాటు వైసీపీ వాళ్లు ఉన్నారు. వైసీపీ అభిమానులు రోడ్లమీదకు వచ్చి బాణాసంచా కాల్చకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తమ టాలెంట్ మొత్తం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌ మీద బుర్రలకు పదుపు పెట్టి మరీ పంచులేస్తున్నారు. ఏపీలో వైసీపీ నేతలపై కేసులు పెట్టడంతో పాటు బాబు […]

జగన్‌ నిర్ణయం వల్లే ఈ సంబరాలు
X

గ్రేటర్‌ ఎన్నికల్లో ఒక్క టీఆర్‌ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ దెబ్బతిన్నాయి. అయితే ఈ ఫలితాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్న పార్టీ టీడీపీ. అదే సమయంలో సంబరాలు చేసుకుంటున్న వారిలో టీఆర్ఎస్‌తో పాటు వైసీపీ వాళ్లు ఉన్నారు. వైసీపీ అభిమానులు రోడ్లమీదకు వచ్చి బాణాసంచా కాల్చకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తమ టాలెంట్ మొత్తం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌ మీద బుర్రలకు పదుపు పెట్టి మరీ పంచులేస్తున్నారు.

ఏపీలో వైసీపీ నేతలపై కేసులు పెట్టడంతో పాటు బాబు పరిపాలన తీరుపై కోపంగా ఉన్న ప్యాన్ పార్టీ ఫ్యాన్స్‌ గ్రేటర్ ఎన్నికల ఫలితాలను బాగా ఎంజాయ్ చేసినట్టు అర్థమవుతోంది. అయితే ఇక్కడో విషయం గమనించాలి. వైసీపీ అభిమానులు ఈ స్థాయిలో ఎంజాయ్ చేయగలుగుతున్నారంటే ఆ పార్టీ తీసుకున్న నిర్ణయమే కారణం. ఒక వేళ గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ కూడా పోటీ చేసి ఉంటే ఫలితాలు టీడీపీ తరహాలోనే వచ్చేవి. అప్పుడు టీడీపీకి సింగిల్ సీటు వచ్చిందని ఎద్దేవా చేసే అవకాశం ఆ పార్టీకి కూడా ఉండేది కాదు. గ్రేటర్ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైసీపీ నాయకత్వం తీసుకున్న తెలివైన నిర్ణయం వల్లే టీడీపీపై జగన్‌ ఫ్యాన్స్‌ పంచ్‌లేసేందుకు ప్లేస్ దొరికింది.

Click on image to Read

JC-Prabhakar-Reddy1

danam-nagender

tdp-media

babu-ghmc-elections

revanth-reddy

ts-tdp

muralimohan

revanth-reddy

collector

narayana-ghmc-election-results

kotla-suryaprakash-reddy

akbaruddin-owaisi-sonia-rahul

kapu-sangam

First Published:  6 Feb 2016 1:22 AM GMT
Next Story