Telugu Global
Cinema & Entertainment

ఒక హీరో మూడ్ లేదంటాడు... మ‌రొక హీరో డామినేట్ చేయ‌కూడ‌దంటాడు!

సినిమా ఫంక్ష‌న్ల‌లో న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు, ఇత‌ర సాంకేతిక వ‌ర్గం చెబుతున్న  మాట‌లు వింటే ఆ రంగంలో అంద‌రూ ఎంత స‌హ‌కారంతో ప‌నిచేస్తున్నారు క‌దా…అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా నిర్మాణ వ్య‌యం గురించి మాట్లాడేట‌ప్పుడు అంద‌రూ దాన్ని త‌గ్గించాల‌నే చెబుతుంటారు. నిర్మాత బాగుండాలి, నిర్మాత పచ్చ‌గా ఉండాలి….లాంటి మాట‌లు  త‌ర‌చుగా విన‌బ‌డుతుంటాయి. కానీ ఆచ‌ర‌ణ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి అది అమ‌లు కావ‌డం లేద‌నిపిస్తుంది. వ‌రుస‌గా రెండుమూడు సినిమాలు ఫెయిల‌యితే న‌టీన‌టులు తెర‌మీద‌నుంచి మాయ‌మైపోయే రంగ‌మిది. అయినా కాస్త పేరు రాగానే […]

ఒక హీరో మూడ్ లేదంటాడు...  మ‌రొక హీరో డామినేట్ చేయ‌కూడ‌దంటాడు!
X

సినిమా ఫంక్ష‌న్ల‌లో న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు, ఇత‌ర సాంకేతిక వ‌ర్గం చెబుతున్న మాట‌లు వింటే ఆ రంగంలో అంద‌రూ ఎంత స‌హ‌కారంతో ప‌నిచేస్తున్నారు క‌దా…అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా నిర్మాణ వ్య‌యం గురించి మాట్లాడేట‌ప్పుడు అంద‌రూ దాన్ని త‌గ్గించాల‌నే చెబుతుంటారు. నిర్మాత బాగుండాలి, నిర్మాత పచ్చ‌గా ఉండాలి….లాంటి మాట‌లు త‌ర‌చుగా విన‌బ‌డుతుంటాయి. కానీ ఆచ‌ర‌ణ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి అది అమ‌లు కావ‌డం లేద‌నిపిస్తుంది.

వ‌రుస‌గా రెండుమూడు సినిమాలు ఫెయిల‌యితే న‌టీన‌టులు తెర‌మీద‌నుంచి మాయ‌మైపోయే రంగ‌మిది. అయినా కాస్త పేరు రాగానే త‌ల‌పై కొమ్ములు వ‌చ్చిన‌ట్టుగా ప్ర‌వ‌ర్తించేవారూ ఉన్నాయి. అలాంటి కొన్ని సంద‌ర్భాలు ఈ మ‌ధ్య కాలంలో సినీవ‌ర్గాల ద్వారా వెలుగులోకి వ‌చ్చాయి. ఒక కుర్ర హీరో త‌న‌కు ఆ రోజు షూటింగ్‌లో పాల్గొనే మూడ్ లేద‌ని చెప్ప‌డంతో, పాతిక ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టి వేసిన సెట్ వృథా అయిపోయింద‌ట‌. ఎందుకంటే త‌రువాత రోజు అ ప్లేస్‌ని మ‌రొక సినిమా కంపెనీకి ఇచ్చేయ‌డంతో వారు ఈ సెట్‌ని పూర్తిగా కూల‌దోసి కొత్త‌దాన్ని నిర్మించుకున్నారు. అలా ఆ నిర్మాత‌కి పాతిక ల‌క్ష‌ల న‌ష్టం జ‌రిగింది. మ‌రో హీరో అయితే సినిమాను తాను భుజాల మీద మోయ‌గ‌ల‌న‌ని బ్ర‌హ్మానందం త‌న‌ని ఓవ‌ర్‌టేక్ చేయ‌కూడ‌ద‌ని ష‌ర‌తు పెట్టాడ‌ట‌. రెండు హిట్ సినిమాలు ఇచ్చిన మ‌రో హీరో సినిమాలో జూనియ‌ర్ విలన్‌తో తాను ఫైట్ చేయ‌న‌ని సీనియ‌ర్ విల‌న్‌తోనే చేస్తాన‌ని ప‌ట్టుబ‌ట్టాడ‌ట. అలాగే త‌న‌కి ఇంకా ఎక్కువ పంచ్ డైలాగులు కావాల‌ని, ఎక్కువ క్లోజ‌ప్ షాట్స్ కావాల‌ని మారాం చేసే హీరోలూ ఉన్నారు.

మ‌రొక హీరో త‌న‌కు కాస్ట్యూమ్స్ అమెరికాలోనే కొనాలంటాడు. ఇంకో క‌మెడియ‌న్ ఒక్క గంట‌లో వ‌చ్చేస్తాన‌ని ద‌ర్శ‌కుడికి చెప్పి వెళ్లి మ‌రొక సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వ‌స్తాడు. ఇవ‌న్నీ నిర్మాత‌కు క‌ష్టం, న‌ష్టం క‌లిగించే విష‌యాలే. సినిమారంగంలో విజ‌యమ‌నేది జూదంలా తయారయిన నేప‌థ్యంలో కూడా నిర్మాతకి ఇలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయంటే ఆశ్చ‌ర్యంగానే ఉంది.

బొబ్బిలిరాజా స‌మ‌యంలో వాణిశ్రీ, ముందుగా చెప్ప‌కుండా షూటింగుల‌కు ఆల‌స్యంగా వ‌చ్చేవార‌ని, అందుకే త‌మ త‌రువాత సినిమాల్లో శార‌ద‌ను తీసుకున్నామ‌ని నిర్మాత డి సురేష్ బాబు చెప్పారు. ఇలియానా కూడా ఇలాంటి ఇబ్బంది పెట్టే ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగానే అవ‌కాశాలు కోల్పోయింద‌ని ఆయ‌న‌ అన్నారు.

2000సంవ‌త్స‌రానికి ముందు ప‌రిస్థితి ఇలా ఉండేది కాదంటున్నారు ద‌ర్శ‌కుడు మోహ‌న్ గాంధీ. ఇప్పుడు హీరోల్లా అప్ప‌టివారు పంచ్ డైలాగులు కావాల‌ని అడిగితే, ద‌ర్శ‌కుడు నిర్మొహ‌మాటంగా నీ సినిమాలో పెట్టుకో ఇందులో కుద‌ర‌దు… అని చెప్ప‌గ‌లిగే వాడ‌ని, ఇప్పుడా ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న అన్నారు.

సినిమా తెర‌మీద న‌టీన‌టులే క‌నిపించినా ఇందులో కీల‌క వ్య‌క్తులు ద‌ర్శ‌కుడితో పాటు ప్రేక్ష‌కుడు, నిర్మాత‌….ప్రేక్ష‌కుడు చూడ‌క‌పోయినా, నిర్మాత తీయ‌క‌పోయినా సినిమా అనేది ఉండ‌దు. ఈ విష‌యాల‌ను గుర్తు పెట్టుకుని, ఎవ‌రికివారు స్వీయ నిబంధ‌న‌ల‌తో వ్య‌యాన్ని పెంచ‌కుండా ఉంటేనే సినిమా ప‌దికాలాలు మ‌న‌గ‌లుగుతుంద‌నేది నిజం.

First Published:  3 Feb 2016 3:24 AM GMT
Next Story