Telugu Global
Cinema & Entertainment

 బన్నీ నెక్ట్స్ సినిమా అదేనా...?

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు అల్లుఅర్జున్. మరో నెల రోజుల్లో ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అందుకే అప్పుడే తన నెక్ట్స్ సినిమా పనిలో పడ్డాడు బన్నీ. ఇప్పటికే పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నప్పటికీ… తమిళ దర్శకుడు లింగుస్వామి చెప్పిన స్టోరీలైన్ మాత్రం అల్లు అర్జున్ కు బాగా నచ్చినట్టు సమాచారం. కుదిరితే లింగుస్వామి దర్శకత్వంలోనే నెక్ట్స్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. మరీ ముఖ్యంగా ఎప్పట్నుంచో […]

 బన్నీ నెక్ట్స్ సినిమా అదేనా...?
X
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు అల్లుఅర్జున్. మరో నెల రోజుల్లో ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అందుకే అప్పుడే తన నెక్ట్స్ సినిమా పనిలో పడ్డాడు బన్నీ. ఇప్పటికే పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నప్పటికీ… తమిళ దర్శకుడు లింగుస్వామి చెప్పిన స్టోరీలైన్ మాత్రం అల్లు అర్జున్ కు బాగా నచ్చినట్టు సమాచారం. కుదిరితే లింగుస్వామి దర్శకత్వంలోనే నెక్ట్స్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. మరీ ముఖ్యంగా ఎప్పట్నుంచో తమిళనాట కూడా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న బన్నీకి… లింగుస్వామి సినిమా మంచి ఫ్లాట్ ఫాంలా కనిపించింది. అందుకే 99శాతం లింగుస్వామి సినిమాకే కమిటయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సినిమా టేకింగ్ విషయంలో లింగుస్వామిది ప్రత్యేకమైన శైలి. రన్, ఆవారా లాంటి సినిమాల్లో అది కనిపిస్తుంది. మరి ఈ విలక్షణ దర్శకుడు… బన్నీని ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.
First Published:  29 Jan 2016 11:17 PM GMT
Next Story