Telugu Global
Cinema & Entertainment

నాలుగు సినిమాలు...ఆ  సినిమాకే ఎక్కువ ఓట్లు

సంక్రాంతి తర్వాత తొలిసారిగా ఒకేసారి 4 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మొన్నటివరకు నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాల హవానే నడిచింది. అయితే శుక్రవారం నుంచి మాత్రం ఈ 4 సినిమాల పోస్టర్లే ఎక్కువగా కనిపించాయి. ఆ నాలుగు… సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, కళావతి, నేనూ రౌడీనే, లచ్చిందేవికి ఓ లక్కుంది. వీటిలో రెండు స్ట్రయిట్ సినిమాలైతే… మిగతా రెండు డబ్బింగ్ సినిమాలు. అయితే విడుదలైన 4 సినిమాల్లో కేవలం సీతమ్మ అందాలు రామయ్య […]

నాలుగు సినిమాలు...ఆ  సినిమాకే ఎక్కువ ఓట్లు
X
సంక్రాంతి తర్వాత తొలిసారిగా ఒకేసారి 4 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మొన్నటివరకు నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాల హవానే నడిచింది. అయితే శుక్రవారం నుంచి మాత్రం ఈ 4 సినిమాల పోస్టర్లే ఎక్కువగా కనిపించాయి. ఆ నాలుగు… సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, కళావతి, నేనూ రౌడీనే, లచ్చిందేవికి ఓ లక్కుంది. వీటిలో రెండు స్ట్రయిట్ సినిమాలైతే… మిగతా రెండు డబ్బింగ్ సినిమాలు. అయితే విడుదలైన 4 సినిమాల్లో కేవలం సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, కళావతి మాత్రం ఆకట్టుకున్నాయి.
వరుస విజయాలతో ఊపమీదున్న రాజ్ తరుణ్…. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాతో కూడా డీసెంట్ హిట్ కొడతాడని అంతా ఊహించారు. కానీ సినిమాలో సాగదీత ఎక్కువైందనే విమర్శలు వినిపించినా హిట్ టాక్ నే సంపాదించుకుంది. ఇక లచ్చిందేవి ఒక లెక్కుంది అనే సినిమా ట్రయిలర్స్ తో ఆకట్టుకున్నప్పటికీ…. థియేటర్లలో మాత్రం బోర్ కొట్టేసింది. మంచి కాన్సెప్ట్ ను పక్కా స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేయడంలో ఫెయిలయ్యారు. కీరవాణి సంగీతం కూడా పరమ బోర్ కొట్టింది. ఇక డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే….. త్రిష-హన్సిక హీరోయిన్లుగా…. సిద్దార్థ్ హీరోగా నటించిన కళావతి సినిమా కొద్దోగొప్పో మార్కులు తెచ్చుకుంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో… ఆ సన్నివేశాలేవీ భయాన్ని పుట్టించవు. కానీ విచిత్రంగా కొన్ని కామెడీ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు నచ్చుతాయి. అలా ఈ సినిమా కొందరికి కనెక్ట్ అయింది. ఇక నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన నేనూ రౌడీనే అనే సినిమా గురించైతే ఎవరూ మాట్లాడుకోవడం కూడా లేదు.
First Published:  29 Jan 2016 7:45 PM GMT
Next Story