Telugu Global
Cinema & Entertainment

మాధవ‌న్ త‌న‌కు పెళ్లే కాద‌నుకున్నాడ‌ట‌!

స‌ఖి, చెలి, ప్రియ‌స‌ఖి…అంటూ ప్రేమ‌క‌థా చిత్రాల‌తో మ‌హిళ‌ల‌కు ఆక‌ట్టుకున్న హీరో మాధ‌వ‌న్, అసలు జీవితంలో త‌న‌కు పెళ్ల‌వుతుంద‌ని అనుకోలేద‌ట‌. నిన్న‌నే విడుద‌ల అయిన హిందీ సినిమా సాలా క‌డూస్ ప్ర‌చారంలో భాగంగా ఒక హిందీ టివి ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయన త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు కొన్ని పంచుకున్నారు. తాను న‌ల్ల‌గా ఉండ‌టం వ‌ల‌న ఏ అమ్మాయీ త‌న‌ను ఇష్ట‌ప‌డ‌ద‌ని అనుకునేవాడ‌ట‌. కానీ అప్ప‌టికి త‌న విద్యార్థినిగా ఉన్న స‌రిత త‌న‌ని ఒక‌రోజు డేట్ కి పిలిచింద‌ని, న‌ల్ల‌గా ఉన్న త‌న‌ని ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌ర‌నే ఆలోచ‌న‌ల‌తో […]

మాధవ‌న్ త‌న‌కు పెళ్లే కాద‌నుకున్నాడ‌ట‌!
X

స‌ఖి, చెలి, ప్రియ‌స‌ఖి…అంటూ ప్రేమ‌క‌థా చిత్రాల‌తో మ‌హిళ‌ల‌కు ఆక‌ట్టుకున్న హీరో మాధ‌వ‌న్, అసలు జీవితంలో త‌న‌కు పెళ్ల‌వుతుంద‌ని అనుకోలేద‌ట‌. నిన్న‌నే విడుద‌ల అయిన హిందీ సినిమా సాలా క‌డూస్ ప్ర‌చారంలో భాగంగా ఒక హిందీ టివి ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయన త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు కొన్ని పంచుకున్నారు. తాను న‌ల్ల‌గా ఉండ‌టం వ‌ల‌న ఏ అమ్మాయీ త‌న‌ను ఇష్ట‌ప‌డ‌ద‌ని అనుకునేవాడ‌ట‌. కానీ అప్ప‌టికి త‌న విద్యార్థినిగా ఉన్న స‌రిత త‌న‌ని ఒక‌రోజు డేట్ కి పిలిచింద‌ని, న‌ల్ల‌గా ఉన్న త‌న‌ని ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌ర‌నే ఆలోచ‌న‌ల‌తో ఉండ‌టం వ‌ల‌న వెంట‌నే ఒప్పుకున్నాన‌ని, త‌రువాత ఆమెనే పెళ్లాడాన‌ని మాధ‌వ‌న్ చెప్పుకొచ్చాడు.

ఎల‌క్ట్రానిక్స్‌లో డిగ్రీ చేసిన మాధ‌వ‌న్, అప్ప‌ట్లో ఇండియా అంత‌టా తిరుగుతూ క‌మ్యునికేష‌న్‌, ప‌బ్లిక్ స్పీకింగ్‌ల్లో వ‌ర్క్‌షాపులు నిర్వ‌హిస్తుండేవాడు. అలా మ‌హారాష్ట్ర‌లో నిర్వ‌హించిన ఒక వ‌ర్క్‌షాపులో 1991లో స‌రిత ప‌రిచ‌యం అయ్యింది. అప్ప‌టికి ఆమె ఎయిర్ హోస్టెస్‌గా ప‌నిచేస్తుండేది. అలా మాధ‌వ‌న్ ద‌గ్గ‌ర క‌మ్యునికేష‌న్స్‌ కోర్సు చేసిన ఆమె, త‌న ప్రేమ‌ని మాత్రం అత‌నికి చ‌క్క‌గా క‌మ్యునికేట్ చేయ‌గ‌లిగింది. 1999లో వారిద్ద‌రి వివాహం జరిగింది. సాలా క‌డూస్ లో మాధ‌వ‌న్ బాక్సింగ్ ట్రైన‌ర్‌గా కనిపించాడు. సుధా కొంగ‌ర ప్ర‌సాద్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్పుడు ఈ చిత్రం వెంక‌టేష్‌కి బాగా న‌చ్చేసింద‌ని దీని తెలుగు రీమేక్‌లో ఆయ‌న హీరోగా న‌టించ‌నున్నార‌నే వార్త‌లు విన‌బ‌డుతున్నాయి. హిందీ వెర్ష‌న్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌హిళా ద‌ర్శ‌కురాలు సుధా కొంగ‌ర ప్ర‌సాదే దీనికీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని న‌మాచారం.

First Published:  29 Jan 2016 9:54 PM GMT
Next Story