Telugu Global
Cinema & Entertainment

 మరో రీమేక్ లో వెంకీ

విక్టరీ వెంకటేష్ ను… రీమేక్స్ వెంకటేశ్ అని పిలిస్తేనే కరెక్ట్ గా ఉంటుందేమో. విజయాల సంగతి అటుంచి రీమేక్ లు చేయడంలో మాత్రం వెంకీ దిట్ట అయిపోయాడు. రీమేక్స్ చేయడంలో చాలా కంఫర్ట్ ఉంటుందనే విషయాన్ని వెంకీ కూడా ఒప్పుకుంటాడు. గతేడాది గోపాల-గోపాల, దృశ్యం సినిమాల్ని రీమేక్ మూవీస్ గా మనముందుకు తెచ్చిన వెంకీ… ఈ ఏడాది అప్పుడు మరో రీమేక్ నుసిద్ధం చేస్తున్నాడు. హిందీలో మాధవన్ హీరోగా తెరకెక్కిన సాలా ఖదూస్ సినిమా వెంకీని విపరీతంగా […]

 మరో రీమేక్ లో వెంకీ
X
విక్టరీ వెంకటేష్ ను… రీమేక్స్ వెంకటేశ్ అని పిలిస్తేనే కరెక్ట్ గా ఉంటుందేమో. విజయాల సంగతి అటుంచి రీమేక్ లు చేయడంలో మాత్రం వెంకీ దిట్ట అయిపోయాడు. రీమేక్స్ చేయడంలో చాలా కంఫర్ట్ ఉంటుందనే విషయాన్ని వెంకీ కూడా ఒప్పుకుంటాడు. గతేడాది గోపాల-గోపాల, దృశ్యం సినిమాల్ని రీమేక్ మూవీస్ గా మనముందుకు తెచ్చిన వెంకీ… ఈ ఏడాది అప్పుడు మరో రీమేక్ నుసిద్ధం చేస్తున్నాడు. హిందీలో మాధవన్ హీరోగా తెరకెక్కిన సాలా ఖదూస్ సినిమా వెంకీని విపరీతంగా ఆకర్షించింది. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ముందుగానే వెంకీ ఈ సినిమాను ప్రత్యేకంగా చూసి ఫ్లాట్ అయిపోయాడు. మాధవన్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఆ సినిమా రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపాడు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే…. సాలాఖదూస్ సినిమాను తెరకెక్కించిన దర్శకురాలు పక్కా తెలుగు. తననే తెలుగు రీమేక్ కు కూడా దర్శకురాలిగా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు వెంకీ. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న వెంకీ… ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిన వెంటనే… సాలా ఖదూస్ రీమేక్ ను పట్టాలపైకి తీసుకొచ్చే అవకాశముంది.

Click on Image to Read

review-new

trisha-devil
Bahubali-Anushka
Amrutha-Fadnavis-Singer
samantha-ntr
First Published:  28 Jan 2016 4:57 PM GMT
Next Story