Telugu Global
Cinema & Entertainment

డబ్బింగ్ సినిమాకు మారుతి ప్రచారం

తెలుగులో మారుతికి అంతో ఇంతో ఇమేజ్ ఉంది. అతడి బ్రాండ్ ఇమేజ్ తో తెలుగులో విడుదలైన సినిమాలు కూడా ఉన్నాయి. మారుతి ఆశీస్సులతో… మారుతి దర్శకత్వం పర్యవేక్షణలో… మారుతి మెచ్చిన సినిమా…. ఇలా రకరకాల టైటిల్స్ తగిలించి ఆ మధ్య కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడీ మారుతిని ఓ డబ్బింగ్ సినిమా కూడా ఆశ్రయించింది. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన కళావతి సినిమాను మారుతి తెగ మెచ్చుకుంటున్నాడు. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు స్మార్ట్ ఫోన్ […]

డబ్బింగ్ సినిమాకు మారుతి ప్రచారం
X
తెలుగులో మారుతికి అంతో ఇంతో ఇమేజ్ ఉంది. అతడి బ్రాండ్ ఇమేజ్ తో తెలుగులో విడుదలైన సినిమాలు కూడా ఉన్నాయి. మారుతి ఆశీస్సులతో… మారుతి దర్శకత్వం పర్యవేక్షణలో… మారుతి మెచ్చిన సినిమా…. ఇలా రకరకాల టైటిల్స్ తగిలించి ఆ మధ్య కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడీ మారుతిని ఓ డబ్బింగ్ సినిమా కూడా ఆశ్రయించింది. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన కళావతి సినిమాను మారుతి తెగ మెచ్చుకుంటున్నాడు. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు స్మార్ట్ ఫోన్ అందుకున్న మారుతి…. కళావతి సినిమా ఫస్ట్ కాపీ చూశానని.. ఇదొక టెర్రిఫిక్, సూపర్ హిట్ సినిమా అని…. ఎవరూ మిస్ అవ్వొద్దని ఊదరగొడుతున్నాడు. ఓవైపు తెలుగు సంఘాలు, సినిమా పెద్దలంతా…. డబ్బింగ్ సినిమాలని ప్రోత్సహించొద్దు బాబూ అని నెత్తీనోరు కొట్టుకుంటుంటే…. మారుతి మాత్రం అవేవీ పట్టించుకోకుండా కళావతి సినిమాను వెనకేసుకొస్తున్నాడు. కళావతి సినిమా విషయంలో మారుతి ఎందుకిలా బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయాడనేది… మేం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాస్త ఆలోచిస్తే ఎవరికైనా అర్థం అయిపోతుంది.

Click on Image to Read

review-new

trisha-devil
Bahubali-Anushka
Amrutha-Fadnavis-Singer
samantha-ntr
First Published:  29 Jan 2016 9:17 AM GMT
Next Story