Telugu Global
Cinema & Entertainment

కళావతితో ఢీకొడుతున్న రౌడీ

సంక్రాంతికి బడా హీరోల మధ్య పోరు చూశాం. సమ్మర్ కు మరికొంతమంది స్టార్ హీరోల మధ్య పోరు చూడబోతున్నాం. మరి ఈ గ్యాప్ లో పరిస్థితేంటి. గ్యాప్ లో కూడా పోరు ఉంది. అయితే ఇది హీరోల పోరు కాదు. హీరోయిన్ల మధ్య సిగపట్లు. మరీ ముఖ్యంగా ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ పోటీ పడుతున్న పరిస్థితి. ఆ రెండు సినిమాల్లో ఒకటి కళావతి అయితే…ఇంకోటి నేనూ రౌడీనే. ఈ రెండూ డబ్బింగ్ సినిమాలే. రెండూ ఇప్పుడు తెలుగులో […]

కళావతితో ఢీకొడుతున్న రౌడీ
X
సంక్రాంతికి బడా హీరోల మధ్య పోరు చూశాం. సమ్మర్ కు మరికొంతమంది స్టార్ హీరోల మధ్య పోరు చూడబోతున్నాం. మరి ఈ గ్యాప్ లో పరిస్థితేంటి. గ్యాప్ లో కూడా పోరు ఉంది. అయితే ఇది హీరోల పోరు కాదు. హీరోయిన్ల మధ్య సిగపట్లు. మరీ ముఖ్యంగా ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ పోటీ పడుతున్న పరిస్థితి. ఆ రెండు సినిమాల్లో ఒకటి కళావతి అయితే…ఇంకోటి నేనూ రౌడీనే. ఈ రెండూ డబ్బింగ్ సినిమాలే. రెండూ ఇప్పుడు తెలుగులో పోటీపడుతున్నాయి. హారర్ కామెడీ సబ్జెక్ట్ తో కళావతి తెరకెక్కింది. త్రిష-హన్సిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సిద్దార్థ్ హీరోగా కనిపిస్తాడు. అటు నేనూ రౌడీనే సినిమాలో నయనతార హీరోయిన్. సో… ఈసారి బాక్సాఫీస్ బరిలోత్రిష-హన్సిక గెలుస్తారా… లేక నయనతార సోలోగా విజయం అందుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాలు శుక్రవారం బరిలోకి దిగబోతున్నాయి.
First Published:  27 Jan 2016 1:36 PM GMT
Next Story