Telugu Global
Others

రాయపాటికి అండగా రంగంలోకి లోకనాయకుడు

బ్యాంకుల్లో వేల కోట్ల అప్పులు చేసి ఆస్తుల వేలానికి దగ్గరగా ఉన్న టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావును రక్షించేందుకు లోకనాయకుడు రంగంలోకి దిగారు. లోకనాయకుడంటే ఎవరో కాదు… చంద్రబాబు. ఇటీవల చంద్రబాబును ఆనం వివేకానందరెడ్డి లోకనాయకుడిగా కీర్తించి ఆ పేరుకు బాగా పబ్లిసిటీ తెచ్చారు. అందరినీ కాపాడే నాయకుడు కాబట్టి చంద్రబాబును లోకనాయకుడిగా అభివర్ణించినట్టు  ఆనం చెప్పారు. ఆ పేరును నిజం చేసేలా చంద్రబాబు ఇప్పుడు అలా ముందుకెళ్తున్నారు. అసలు విషయం ఏమిటంటే రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ […]

రాయపాటికి అండగా రంగంలోకి లోకనాయకుడు
X

బ్యాంకుల్లో వేల కోట్ల అప్పులు చేసి ఆస్తుల వేలానికి దగ్గరగా ఉన్న టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావును రక్షించేందుకు లోకనాయకుడు రంగంలోకి దిగారు. లోకనాయకుడంటే ఎవరో కాదు… చంద్రబాబు. ఇటీవల చంద్రబాబును ఆనం వివేకానందరెడ్డి లోకనాయకుడిగా కీర్తించి ఆ పేరుకు బాగా పబ్లిసిటీ తెచ్చారు. అందరినీ కాపాడే నాయకుడు కాబట్టి చంద్రబాబును లోకనాయకుడిగా అభివర్ణించినట్టు ఆనం చెప్పారు. ఆ పేరును నిజం చేసేలా చంద్రబాబు ఇప్పుడు అలా ముందుకెళ్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు రూపురేఖలు మార్చేదిగా భావిస్తున్న ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును 2013లో దక్కించుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీల నోరు మూయించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఎంపీకి ఒక్కో ఆఫర్ ఇచ్చింది. ఆ కోటాలో రాయపాటికి పోలవరం కాంట్రాక్ట్ దక్కిందని చెబుతుంటారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందస్తు అడ్వాన్సుగా ప్రభుత్వం నుంచి ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ వందల కోట్లు తీసుకుంది. ప్రాజెక్ట్ వద్ద తట్టమట్టి కూడా తీయకుండానే దాదాపు వెయ్యి కోట్లను రాయపాటి కంపెనీ జేబులో వేసుకుంది. అయితే ఇప్పుడు కంపెనీ అప్పుల్లో కూరుకుపోయి చేతులెత్తేసేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి కంపెనీలను సాధారణంగా అయితే ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో పెడుతుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రాయపాటి కంపెనీని కాపాడేందుకు రంగంలోకి దిగింది.

ట్రాన్స్‌ట్రాయ్‌కి అండగా సబ్ కాంట్రాక్టర్‌ను వెతికే పనిని తన భుజాల మీద వేసుకుంది. ఈమేరకు అక్టోబర్ 10న కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. కొత్త కంపెనీలతో నూతనంగా అగ్రిమెంట్లు చేసుకునేందుకు కేపీఎంజీ కన్సల్‌టెంట్ సంస్థను రంగంలోకి దించింది ప్రభుత్వం. పైసా పని చేయకుండానే వెయ్యి కోట్లు జేబులో వేసుకుని ప్రాజెక్టు నిర్మాణంలో చేతులెత్తేసిన రాయపాటి కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల్సిన ప్రభుత్వం ఇలా సబ్ కాంట్రాక్టర్లను వెతికి పని మొదలుపెట్టడంపై సీనియర్‌ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ రూ. 6,961 కోట్లకు అప్పట్లో దక్కించుకుంది.

Click on Image to Read:

లోకేష్‌ ట్యూషన్ టీచర్ ఎవరో తెలుసా?

తాడిపత్రిని లిమ్కాబుక్‌లోకి ఎక్కించిన జేసీ

ఇందుకే జగన్ సీఎం కాలేకపోయాడు!

సిగ్గు సిగ్గు… వెలుగులోకి మరో ”పద్మ” విన్యాసం

అంతొద్దు- బాబు సర్కార్‌ను దెబ్బకొట్టిన కేంద్రం

లీగల్‌ నోటీస్‌ – రోజా తీవ్రవాది కన్నా ప్రమాదకరం

వైఎస్‌ రాజారెడ్డి హంతకుల విడుదల దేనికి సంకేతం?

వీరి కుల విన్యాసాలపై ధ్వజమెత్తిన జాతీయ మీడియా

First Published:  27 Jan 2016 1:52 AM GMT
Next Story