Telugu Global
Cinema & Entertainment

 కంచెకు సీక్వెల్ గా రాయబారి ?

మరోసారి క్రిష్ దర్శకత్వంలోనే సినిమా చేస్తానని… తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించాడు వరుణ్ తేజ. క్రిష్ డైరక్షన్ లో రాయబారి అనే సినిమా చేస్తున్నానంటూ టైటిల్ కూడా ఎనౌన్స్ చేశాడు. కంచెతో హిట్టిచ్చిన క్రిష్ తో మరో సినిమా చేయడంలో వింతేమీ లేదు. కానీ తాజాగా రాబోతున్న రాయబారి అనే సినిమా…. కంచె సినిమాకు సీక్వెలా…. అనే అనుమానాలు మాత్రం రేకెత్తుతున్నాయి. దీనికి బలమైన ఆధారాలు కూడా చూపుతున్నారు చాలామంది. కంచె సినిమాలో హీరో, డైరక్టర్…. రాయబారిలో […]

 కంచెకు సీక్వెల్ గా రాయబారి ?
X
మరోసారి క్రిష్ దర్శకత్వంలోనే సినిమా చేస్తానని… తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించాడు వరుణ్ తేజ. క్రిష్ డైరక్షన్ లో రాయబారి అనే సినిమా చేస్తున్నానంటూ టైటిల్ కూడా ఎనౌన్స్ చేశాడు. కంచెతో హిట్టిచ్చిన క్రిష్ తో మరో సినిమా చేయడంలో వింతేమీ లేదు. కానీ తాజాగా రాబోతున్న రాయబారి అనే సినిమా…. కంచె సినిమాకు సీక్వెలా…. అనే అనుమానాలు మాత్రం రేకెత్తుతున్నాయి. దీనికి బలమైన ఆధారాలు కూడా చూపుతున్నారు చాలామంది.
కంచె సినిమాలో హీరో, డైరక్టర్…. రాయబారిలో కూడా రిపీట్ అయ్యారు. ఇంతవరకు ఓకే. కంచెలో నటించిన ప్రగ్యా జైశ్వాల్ నే రాయబారిలో కూడా తీసుకున్నారు. పోనీ ఇది కూడా ఓకే అనుకుందాం. కంచె సినిమా తీసిన జార్జియా దేశంలోనే రాయబారిని కూడా షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ కాస్త ఆలోచించాలి. కంచె సినిమాలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో చాలామందిని రాయబారిలో కూడా కొనసాగిస్తున్నారట. ఇది మరీ ఆలోచించదగ్గ విషయం. ఇలా అప్పటి టీమే మళ్లీ కలుస్తుంటే… కంచెకు సీక్వెలే సిద్ధమౌతోందన్న రూమర్లు వినిపిస్తున్నాయి.
First Published:  26 Jan 2016 7:05 PM GMT
Next Story