Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్‌కు మంచు దెబ్బ

నాన్నకు ప్రేమతో సినిమాతో రికార్డుల మీద రికార్డులు సృష్టించాలనుకున్నాడు తారక్. ఆ దిశగా దూసుకుపోతున్నాడు కూడా. ఓవర్సీస్ లో ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్ లో స్థానం సంపాదించుకున్న తారక్… ఈ వీకెండ్ 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి సగర్వంగా దూసుకుపోవాలని అనుకున్నాడు. తారక్ అనుకున్నది జరిగి ఉండేది. కానీ యంగ్ టైగర్ కు కాలం కలిసిరాలేదు. అమెరికాలో మంచు తుఫాన్ విజృంభించింది. దాదాపు 10రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. సుమారు 10వేల విమాన సర్వీసులు […]

ఎన్టీఆర్‌కు మంచు దెబ్బ
X
నాన్నకు ప్రేమతో సినిమాతో రికార్డుల మీద రికార్డులు సృష్టించాలనుకున్నాడు తారక్. ఆ దిశగా దూసుకుపోతున్నాడు కూడా. ఓవర్సీస్ లో ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్ లో స్థానం సంపాదించుకున్న తారక్… ఈ వీకెండ్ 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి సగర్వంగా దూసుకుపోవాలని అనుకున్నాడు. తారక్ అనుకున్నది జరిగి ఉండేది. కానీ యంగ్ టైగర్ కు కాలం కలిసిరాలేదు. అమెరికాలో మంచు తుఫాన్ విజృంభించింది. దాదాపు 10రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. సుమారు 10వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. రోడ్లు, ట్రాక్స్ పై మంచు పేరుకుపోవడంతో…. రైలు, బస్సు సర్వీసులు కూడా ఆపేశారు. దీంతో నాన్నకు ప్రేమతో సినిమాపై ఆ ఎపెక్ట్ భారీగా పడింది. ఇప్పటికే లక్షా 80వేల డాలర్లు సంపాదించిన నాన్నకు ప్రేమతో సినిమా…. మరో 20వేల డాలర్లు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. వీకెండ్ లో ఒక్క రోజు ఆడినా సరిపోతుంది. కానీ మంచు తుఫాన్ దెబ్బ కు జనజీవనం స్తంభించింది. మరి తారక్…. 2 మిలియన్ క్లబ్ లోకి చేరుకుంటాడా అనేది ప్రకృతే నిర్ణయించాలి.
First Published:  23 Jan 2016 7:05 PM GMT
Next Story