Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్‌ ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నారా?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి చేసుకోడం ఖాయమంటున్నారు ఆయన పెదనాన్న కృష్ణం రాజు. అంతే కాదు ప్రభాస్‌ది ప్రేమ వివాహం కూడా కావచ్చని ఇన్‌డైరెక్ట్‌గా క్లూ ఇచ్చారు. కృష్ణంరాజు మాటలు బట్టి చూస్తే ప్రభాస్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నారా అనిపిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌ మ్యారేజ్‌పై కృష్ణంరాజు ఈ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది ప్రభాస్ వివాహం చేసుకోవడం ఖాయమని అది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కూడా కావచ్చని […]

ప్రభాస్‌ ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నారా?
X

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి చేసుకోడం ఖాయమంటున్నారు ఆయన పెదనాన్న కృష్ణం రాజు. అంతే కాదు ప్రభాస్‌ది ప్రేమ వివాహం కూడా కావచ్చని ఇన్‌డైరెక్ట్‌గా క్లూ ఇచ్చారు. కృష్ణంరాజు మాటలు బట్టి చూస్తే ప్రభాస్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నారా అనిపిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌ మ్యారేజ్‌పై కృష్ణంరాజు ఈ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది ప్రభాస్ వివాహం చేసుకోవడం ఖాయమని అది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కూడా కావచ్చని చెప్పారు. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటానని సంక్రాంతి పండగ సందర్భంగా ప్రభాస్ తనకు ప్రామిస్ చేసాడన్నారు. అమ్మాయి ఓకే అయితే ఈ ఏడాదిలో ఎప్పుడైనా పెళ్లి జరగవచ్చన్నారు. బాహుబలి-2 తర్వాత ప్రభాస్‌ తన సొంత బేనర్‌లో సినిమా చేస్తాడని కృష్ణం రాజు తెలిపారు. ఆ సినిమా పూర్తి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

First Published:  19 Jan 2016 11:48 AM GMT
Next Story