Telugu Global
Cinema & Entertainment

దెబ్బకు దెబ్బ- అక్కడ డిక్టేటర్‌ను దెబ్బకొట్టిన ఎన్టీఆర్‌

ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్, బాలయ్య సినిమాలు రెండూ సంక్రాంతి కానుకగా ఒక రోజు తేడాతో థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఎన్టీఆర్ సినిమాను కావాలనే కొంతమంది అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు, ముఖ్యనేతలు…. డిక్టేటర్ కోసం ఎన్టీఆర్ సినిమాను కొన్ని థియేటర్ల నుంచి తొలిగించారు. ముఖ్యంగా రాయలసీమలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ ఎఫెక్ట్ ఎన్టీఆర్ సినిమా వసూళ్లపైనా పడింది. అయితే బాలకృష్ణ పరోక్షంగా కొట్టిన ఈ దెబ్బకు…. ఎన్టీఆర్ […]

దెబ్బకు దెబ్బ- అక్కడ డిక్టేటర్‌ను దెబ్బకొట్టిన ఎన్టీఆర్‌
X

ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్, బాలయ్య సినిమాలు రెండూ సంక్రాంతి కానుకగా ఒక రోజు తేడాతో థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఎన్టీఆర్ సినిమాను కావాలనే కొంతమంది అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు, ముఖ్యనేతలు…. డిక్టేటర్ కోసం ఎన్టీఆర్ సినిమాను కొన్ని థియేటర్ల నుంచి తొలిగించారు. ముఖ్యంగా రాయలసీమలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ ఎఫెక్ట్ ఎన్టీఆర్ సినిమా వసూళ్లపైనా పడింది. అయితే బాలకృష్ణ పరోక్షంగా కొట్టిన ఈ దెబ్బకు…. ఎన్టీఆర్ ఓవర్సీస్ లో ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఓవర్సీస్ లో నాన్నకు ప్రేమతో సినిమా విపరీతంగా ఆడుతోంది. ఎన్నారైలు ఈ సినిమాకు నీరాజనం పడుతున్నారు. మరోవైపు బాలయ్య సినిమాలకు రెస్పాన్స్ అంతంతమాత్రంగానే ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు… డిక్టేటర్ సినిమాను తప్పించి ఆ స్థానంలో నాన్నకు ప్రేమతో సినిమాను ప్రదర్శించాలని అనుకుంటున్నారట. మొత్తానికి ఎన్టీఆర్ కూడా లెక్క సరిచేసినట్టున్నాడు.

Click on Image to Read:

kcr-balakrishna

First Published:  17 Jan 2016 10:08 PM GMT
Next Story