Telugu Global
Cinema & Entertainment

పరిచయం అక్కర్లేని వ్యక్తికి మహేష్ పరిచయం

సూపర్ స్టార్ కృష్ణ….. నిజంగా పరిచయం అక్కర్లేని పేరు. ఏ జనరేషన్ వ్యక్తులైనా గుర్తుపట్టే ఎవర్ గ్రీన్ హీరో కృష్ణ. అలాంటి పరిచయం అక్కర్లేని హీరోను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమౌతున్నాడు మహేష్. అవును… కృష్ణ నటించిన ఓ సినిమాకు మహేష్ పరిచయం వాక్యాలు చెప్పబోతున్నాడు. అంటే…. వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడన్నమాట. ముప్పలనేని శివ దర్శకత్వంలో కృష్ణ-విజయనిర్మల ప్రధానపాత్రల్లో శ్రీశ్రీ అనే సినిమా తెరకెక్కింది. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత కృష్ణ నటించిన సినిమా కావడంతో…. సహజంగానే ఈ […]

పరిచయం అక్కర్లేని వ్యక్తికి మహేష్ పరిచయం
X
సూపర్ స్టార్ కృష్ణ….. నిజంగా పరిచయం అక్కర్లేని పేరు. ఏ జనరేషన్ వ్యక్తులైనా గుర్తుపట్టే ఎవర్ గ్రీన్ హీరో కృష్ణ. అలాంటి పరిచయం అక్కర్లేని హీరోను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమౌతున్నాడు మహేష్. అవును… కృష్ణ నటించిన ఓ సినిమాకు మహేష్ పరిచయం వాక్యాలు చెప్పబోతున్నాడు. అంటే…. వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడన్నమాట. ముప్పలనేని శివ దర్శకత్వంలో కృష్ణ-విజయనిర్మల ప్రధానపాత్రల్లో శ్రీశ్రీ అనే సినిమా తెరకెక్కింది. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత కృష్ణ నటించిన సినిమా కావడంతో…. సహజంగానే ఈ మూవీపై అందరి దృష్టిపడింది. ఇలాంటి సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చేందుకు మహేష్ తో గెస్ట్ రోల్ ప్లాన్ చేశారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో… ప్రిన్స్ తో వాయిస్ ఓవర్ ఇప్పించబోతున్నారు. కృష్ణ ఇంట్రడక్షన్ సన్నివేశాలకు మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడన్నమాట.
First Published:  17 Jan 2016 7:06 PM GMT
Next Story