Telugu Global
Cinema & Entertainment

యంగ్ టైగర్ "డాలర్ బాబు" అయ్యాడు

ఓవర్సీస్ లో ఎన్టీఆర్ కు కాస్త పట్టు తక్కువనే విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. మహేష్, పవన్ తో పోలిస్తే తారక్ కు ఓవర్సీస్ లో ఫాలోయింగ్ తక్కువ. కానీ ఇకపై ఈ విమర్శ చేయడానికి వీల్లేదు. తారక్ పొటెన్షియాలిటీ…. ఓవర్సీస్ లో కూడా పెరిగింది. నాన్నకు ప్రేమతో సినిమాతో అది ప్రూవ్ అయింది. విదేశాల్లో వరుసగా మూడో సారి మిలియన్ డాలర్ మార్క్ అందుకున్నాడు యంగ్ టైగర్. విడుదలైన 3 రోజులకే, ఓవర్సీస్ లో లక్ష డాలర్ల […]

యంగ్ టైగర్ డాలర్ బాబు అయ్యాడు
X
ఓవర్సీస్ లో ఎన్టీఆర్ కు కాస్త పట్టు తక్కువనే విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. మహేష్, పవన్ తో పోలిస్తే తారక్ కు ఓవర్సీస్ లో ఫాలోయింగ్ తక్కువ. కానీ ఇకపై ఈ విమర్శ చేయడానికి వీల్లేదు. తారక్ పొటెన్షియాలిటీ…. ఓవర్సీస్ లో కూడా పెరిగింది. నాన్నకు ప్రేమతో సినిమాతో అది ప్రూవ్ అయింది. విదేశాల్లో వరుసగా మూడో సారి మిలియన్ డాలర్ మార్క్ అందుకున్నాడు యంగ్ టైగర్. విడుదలైన 3 రోజులకే, ఓవర్సీస్ లో లక్ష డాలర్ల క్లబ్ లోకి చేరిపోయి సరికొత్త రికార్డు సృష్టించాడు ఎన్టీఆర్. గతంలో యంగ్ టైగర్ నటించిన టెంపర్, బాద్ షా సినిమాలు కూడా లక్ష డాలర్లు సంపాదించినప్పటికీ…. నాన్నకు ప్రేమతో అంత ఫాస్ట్ గా జస్ట్ 3 రోజుల్లో ఇంత స్థాయి వసూళ్లు సాధించడం మాత్రం జరగలేదు. అందుకే ఎన్టీఆర్ కు ఇది చాలా స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. మరోవైపు తారక్ సినిమాకు విదేశాల్లో వస్తున్న రెస్పాన్స్ చూసి, డిస్ట్రిబ్యూటర్లు ఆ మూవీకి మరిన్ని థియేటర్లు కేటాయించే పనిలో పడ్డారు. ప్రస్తుతం అమెరికాలో 60 థియేటర్లలో మాత్రమే నాన్నకు ప్రేమతో సినిమాను ప్రదర్శిస్తున్నారు. త్వరలోనే ఈ సంఖ్యను 160కు పెంచాలని డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు. సో… వచ్చే వీకెండ్ నాటికి నాన్నకు ప్రేమతో సినిమా విదేశాల్లో 2లక్షల డాలర్లు ఆర్జించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
First Published:  17 Jan 2016 7:02 PM GMT
Next Story