Telugu Global
Others

స్పీకర్‌ కోడెలపై టీడీపీ నేత ఆరోపణలు, ఆర్యవైశ్యుల ఆగ్రహం

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్, టీడీపీ నేత నాగేశ్వరరావు అరెస్ట్ దుమారం రేపుతోంది. ఈ అరెస్ట్ ద్వారా టీడీపీలోని వర్గవిభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వైస్‌ చైర్మన్‌ నాగేశ్వరరావు నేరుగా స్పీకర్‌ కోడెలపై ఆరోపణలు చేశారు. అసలేం జరిగిందంటే… నాగేశ్వరరావు ఇంటి సమీపంలోనే ఓ మద్యం షాపు ఉంది. అక్కడ మద్యం సేవించిన మద్యం ప్రియులు అక్కడే మూత్రవిసర్జన చేస్తున్నారు. దీన్ని నిరోధించేందుకు నాగేశ్వరరావు మూడు మతాలకు చెందిన దేవతామూర్తుల ఫోటోలను గోడలపై ఏర్పాటు చేశారు. […]

స్పీకర్‌ కోడెలపై టీడీపీ నేత ఆరోపణలు, ఆర్యవైశ్యుల ఆగ్రహం
X

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్, టీడీపీ నేత నాగేశ్వరరావు అరెస్ట్ దుమారం రేపుతోంది. ఈ అరెస్ట్ ద్వారా టీడీపీలోని వర్గవిభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వైస్‌ చైర్మన్‌ నాగేశ్వరరావు నేరుగా స్పీకర్‌ కోడెలపై ఆరోపణలు చేశారు. అసలేం జరిగిందంటే… నాగేశ్వరరావు ఇంటి సమీపంలోనే ఓ మద్యం షాపు ఉంది. అక్కడ మద్యం సేవించిన మద్యం ప్రియులు అక్కడే మూత్రవిసర్జన చేస్తున్నారు. దీన్ని నిరోధించేందుకు నాగేశ్వరరావు మూడు మతాలకు చెందిన దేవతామూర్తుల ఫోటోలను గోడలపై ఏర్పాటు చేశారు. అయినప్పటికీ మద్యం సేవించిన వారి తీరు మారలేదు.

ఈ నేపథ్యంలో కొందరు ముస్లింలు నాగేశ్వరరావు వద్దకు వెళ్లి తమ మతానికి సంబంధించిన చిహ్నాలను గోడపై ముద్రించడాన్ని తప్పుపట్టారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్యవైశ్యులు నాగేశ్వరరావుకు మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అయితే దీనంతటికి కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు కోడెల శివరామే కారణమని నాగేశ్వరరావు ఆరోపిస్తున్నారు. కావాలనే కొందరిని రెచ్చగొట్టి తనమీదకు ఉసుగొల్పారని అంటున్నారు. టీడీపీలో తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తండ్రికొడుకు కలిసి పోలీసుల సాయంతో వేధిస్తున్నారని మండిపడ్డారు. కోడెల నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. దీనిపై మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు.

First Published:  15 Jan 2016 2:47 AM GMT
Next Story