Telugu Global
Others

చంద్రబాబు కోసం రూ. కోటి

ప్రత్యేక విమానాలు, చాంబర్ల ఆధునికరణ, యోగా క్లాసుల పేరుతో  ప్రజాధనాన్ని సీఎం చంద్రబాబు వృథా చేస్తున్నారన్న విమర్శలు చాలా కాలంగా వస్తున్నాయి. సీఎం అయిన ఏడాదిలోనే ఇలా దాదాపు 120 కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు. తాజాగా చంద్రబాబు దావోస్ పర్యటన కోసం కోటి రూపాయలను ఆర్థిక శాఖ మంజూరు చేసింది. తొలి విడతగా రూ. 70 లక్షలు విడుదల చేశారు. ఈనెల 19 నుంచి 24 వరకు చంద్రబాబుతో పాటు తొమ్మిది మంది సభ్యుల బృందం […]

చంద్రబాబు కోసం రూ. కోటి
X

ప్రత్యేక విమానాలు, చాంబర్ల ఆధునికరణ, యోగా క్లాసుల పేరుతో ప్రజాధనాన్ని సీఎం చంద్రబాబు వృథా చేస్తున్నారన్న విమర్శలు చాలా కాలంగా వస్తున్నాయి. సీఎం అయిన ఏడాదిలోనే ఇలా దాదాపు 120 కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు. తాజాగా చంద్రబాబు దావోస్ పర్యటన కోసం కోటి రూపాయలను ఆర్థిక శాఖ మంజూరు చేసింది. తొలి విడతగా రూ. 70 లక్షలు విడుదల చేశారు. ఈనెల 19 నుంచి 24 వరకు చంద్రబాబుతో పాటు తొమ్మిది మంది సభ్యుల బృందం దావోస్‌లో పర్యటిస్తుంది. ప్రత్యేక విమానంలోనే చంద్రబాబు బృందం దావోస్ వెళ్లనుంది.

గతంలో హైదరాబాద్‌ సచివాలయంలో తన చాంబర్‌ ఆధునీకరణకు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు. అంత చేశాక వాస్తు బాగోలేదంటూ ఎల్‌ బ్లాక్‌లోకి మారారు. అక్కడ కోట్లు ఖర్చు పెట్టి చాంబర్‌ మరమ్మతులు చేయించుకున్నారు. కృష్ణా నది ఒడ్డున గెస్ట్‌ హౌజ్‌ కోసం కోట్లు ఖర్చు పెట్టి భవన మరమ్మతులు, ప్రత్యేక రోడ్డు వేయించుకున్నారు. ఇల్లు, చాంబర్ల అభివృద్ధి కోసమే చంద్రబాబు ఖర్చు చేసిన సొమ్ము 42 కోట్లకు పైగానే ఉంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులకు జగ్గీవాసుదేవన్‌ చేత మూడు రోజుల పాటు యోగా క్లాసులిప్పించి ఏకంగా బాబా గారికి ప్రజాధనం నుంచి మూడు కోట్లు కట్టబెట్టారు. మూడు రోజుల యోగా క్లాస్‌కు మూడు కోట్లను లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం చెల్లించడం అప్పట్లో దుమారం రేపింది. అయినా కూడా చంద్రబాబు వెనక్కు తగ్గుతున్నట్టు కనిపించడం లేదు.

First Published:  14 Jan 2016 12:11 AM GMT
Next Story