Telugu Global
NEWS

ఇడుపులపాయపై కన్నేసిన బాబు

ఇడుపులపాయ ఎస్టేట్. దివంగత నేత వైఎస్‌కు అత్యంత ఇష్టమైన ప్రాంతం. వైఎస్‌ కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రం. ఇప్పుడు ఇది మరోసారి వార్తల్లోక్కెక్కింది. ఇటీవల జన్మభూమి కార్యక్రమం కోసం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి వెళ్లిన చంద్రబాబు … వైఎస్‌ వ్యవసాయ క్షేత్రంపై మూడు రౌండ్లు హెలికాప్టర్‌ ద్వారా చక్కర్లు కొట్టారు . వ్యవసాయ క్షేత్రంతో పాటు వైఎస్ సమాధిని ఆకాశం నుంచే దర్శించారు. చంద్రబాబు ఇలా ఇడుపులపాయ ఎస్టేట్‌పై ఎందుకు చక్కర్లు కొట్టారన్న దానిపై జిల్లా టీడీపీ […]

ఇడుపులపాయపై కన్నేసిన బాబు
X

ఇడుపులపాయ ఎస్టేట్. దివంగత నేత వైఎస్‌కు అత్యంత ఇష్టమైన ప్రాంతం. వైఎస్‌ కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రం. ఇప్పుడు ఇది మరోసారి వార్తల్లోక్కెక్కింది. ఇటీవల జన్మభూమి కార్యక్రమం కోసం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి వెళ్లిన చంద్రబాబు … వైఎస్‌ వ్యవసాయ క్షేత్రంపై మూడు రౌండ్లు హెలికాప్టర్‌ ద్వారా చక్కర్లు కొట్టారు . వ్యవసాయ క్షేత్రంతో పాటు వైఎస్ సమాధిని ఆకాశం నుంచే దర్శించారు. చంద్రబాబు ఇలా ఇడుపులపాయ ఎస్టేట్‌పై ఎందుకు చక్కర్లు కొట్టారన్న దానిపై జిల్లా టీడీపీ నేతలు కొత్త సంగతి చెబుతున్నారు. హెలికాప్టర్‌తో చక్కర్లు కొట్టిన చంద్రబాబు అనంతరం కలెక్టర్‌ దగ్గర ఎస్టేట్‌కు సంబంధించిన వివరాలపై ఆరా తీశారట. వ్యవసాయ క్షేత్రంలో అటవీ భూములేమైనా ఉన్నాయా?, ఆక్రమణలు ఏమైనా జరిగాయా? వంటి వివరాలపై ఆరా తీశారట. అలాంటిదేమీ లేదని అధికారులు చెప్పగా మరోసారి సమీక్షించాలని చంద్రబాబు చెప్పారట.

గతంలోనూ ఈ ఎస్టేట్‌లో అటవీ భూములు అక్రమించారని ఆరోపణలు వచ్చాయి. వైఎస్ సీఎం అవగానే అందులో మూడు వందల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టారు. మరో 300 ఎకరాల భూమిలో ట్రిపుల్‌ ఐటీ నిర్మించారు. నెమళ్ల పార్కుకు కొంత భూమిని ఇచ్చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు మరోసారి వైఎస్ వ్యవసాయక్షేత్రంపై ఆరా తీయడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు ఆదేశాలతో మరోసారి ఎస్టేట్‌ను సర్వే చేస్తారా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్ని సర్వేలు చేసినా ఎలాంటి అవకతవకలు లేవనే తేలుతుందని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇవన్నీ ఒకరకమైన బెదిరింపులేనంటున్నారు.

Click to Read:

GHMC-Elections-Jagan-congress

chandrababu-naidu

First Published:  13 Jan 2016 11:22 PM GMT
Next Story