Telugu Global
Cinema & Entertainment

థియేటర్ లో చూస్తే రూ.100.... పైరసీ చూస్తే రూ.లక్ష

నేను శైలజ సినిమాకు సంబంధించిన వింత కహానీ ఇది. ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను థియేటర్లలో చూస్తే వంద రూపాయలతో పనైపోతుంది. అదే వంద రూపాయలకు కక్కుర్తి పడి పైరసీలో చూసి ఆనందిద్దామని కక్కుర్తి పడితే మాత్రం లక్ష రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తుంది. అవును.. ఈమేరకు హీరో రామ్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. పైరసీలో సినిమా చూసినవాళ్లకు భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు… ఇప్పటికే కొన్ని కంప్యూటర్లకు సంబంధించిన ఐపీలు […]

థియేటర్ లో చూస్తే రూ.100.... పైరసీ చూస్తే రూ.లక్ష
X
నేను శైలజ సినిమాకు సంబంధించిన వింత కహానీ ఇది. ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను థియేటర్లలో చూస్తే వంద రూపాయలతో పనైపోతుంది. అదే వంద రూపాయలకు కక్కుర్తి పడి పైరసీలో చూసి ఆనందిద్దామని కక్కుర్తి పడితే మాత్రం లక్ష రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తుంది. అవును.. ఈమేరకు హీరో రామ్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. పైరసీలో సినిమా చూసినవాళ్లకు భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు… ఇప్పటికే కొన్ని కంప్యూటర్లకు సంబంధించిన ఐపీలు రికార్డు చేశామని చెబుతున్నాడు రామ్. పైరసీ చేసిన వాళ్లను పట్టుకోకుండా… ఇలా పైరసీ చూసినవాళ్లను పట్టుకోవడమేంటనే ప్రశ్నకు కూడా రామ్ దగ్గర సమాధానం ఉంది. పైరసీని ప్రోత్సహించడం కూడా తప్పే అంటున్న ఈ యంగ్ హీరో… ఇప్పటికే ఈ జరిమానా విధానాన్ని హాలీవుడ్ లో అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేస్తున్నాడు. సో…. ఫ్రీగా నెట్ లో దొరుకుతుంది కదా అని నేను శైలజ సినిమాను ఎవరైనా చూశారా… బుక్కయిపోవడం ఖాయం. రామ్ ఇలాంటి వారి కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు.
First Published:  12 Jan 2016 7:03 PM GMT
Next Story