Telugu Global
Others

56 వ్యాగ‌న్ల గూడ్స్ రైలుబండి కింద ఆమె....అయినా బ‌తికింది!

పొర‌బాటున రైలుప‌ట్టాల‌మీద ప‌డిపోయిన ఓ మ‌హిళ‌,  ఎదురుగా రైలు వ‌చ్చేసినా  స‌మ‌య‌స్ఫూర్తితో త‌న ప్రాణాలు ర‌క్షించుకుంది. ప‌శ్చిమ బెంగాల్‌లోని పురులియాకు చెందిన హిమానీ మాంఝీ (45) తాతాన‌గ‌ర్ వెళ్ల‌డానికి పురులియా స్టేష‌న్‌లో న‌డుస్తోంది. రైలుప‌ట్టాలు దాటుతుండ‌గా పొర‌బాటున కాలు ప‌ట్టుత‌ప్పి ప‌ట్టాలమీద  ప‌డిపోయింది. రైల్వే సిబ్బంది, అక్క‌డ ఉన్న ఇత‌రులు ఆమె ప‌డిపోవ‌డం చూశారు. అయితే ఆమెకు స‌హాయం చేసే లోగా అదే ప‌ట్టాల‌మీద‌కు గూడ్స్ బండి వ‌చ్చేసింది. దాంతో వారు, ఆమెను ప‌ట్టాల మ‌ధ్య‌లో క‌ద‌ల‌కుండా […]

56 వ్యాగ‌న్ల గూడ్స్ రైలుబండి కింద ఆమె....అయినా బ‌తికింది!
X

పొర‌బాటున రైలుప‌ట్టాల‌మీద ప‌డిపోయిన ఓ మ‌హిళ‌, ఎదురుగా రైలు వ‌చ్చేసినా స‌మ‌య‌స్ఫూర్తితో త‌న ప్రాణాలు ర‌క్షించుకుంది. ప‌శ్చిమ బెంగాల్‌లోని పురులియాకు చెందిన హిమానీ మాంఝీ (45) తాతాన‌గ‌ర్ వెళ్ల‌డానికి పురులియా స్టేష‌న్‌లో న‌డుస్తోంది. రైలుప‌ట్టాలు దాటుతుండ‌గా పొర‌బాటున కాలు ప‌ట్టుత‌ప్పి ప‌ట్టాలమీద ప‌డిపోయింది. రైల్వే సిబ్బంది, అక్క‌డ ఉన్న ఇత‌రులు ఆమె ప‌డిపోవ‌డం చూశారు. అయితే ఆమెకు స‌హాయం చేసే లోగా అదే ప‌ట్టాల‌మీద‌కు గూడ్స్ బండి వ‌చ్చేసింది. దాంతో వారు, ఆమెను ప‌ట్టాల మ‌ధ్య‌లో క‌ద‌ల‌కుండా అలాగే ప‌డుకుని ఉండ‌మ‌ని చెప్పారు. హిమానీ అలాగే ప‌ట్టాల‌మ‌ధ్య‌లో బోర్లా ప‌డుకుని ఉండిపోయింది. 56వ్యాగ‌న్లతో వెళుతున్న గూడ్సు బండి త‌న‌మీద నుండి వెళుతున్నా ఆమె అలాగే ఊపిరి బిగ‌ప‌ట్టి ఉండిపోయింది. ప‌ట్టాల మీద ప‌డిపోవ‌డం కార‌ణంగా త‌గిలిన చిన్న‌పాటి దెబ్బ‌లు త‌ప్ప ఎలాంటి హానీ జ‌ర‌గ‌కుండా ఆ ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డింది.

వెంట‌నే ఆమెకు ప్రాథ‌మిక చికిత్స చేసి తాతాన‌గ‌ర్ రైలు ఎక్కించిన‌ట్టుగా పురులియా రైల్వేస్టేష‌న్ అధికారులు చెప్పారు. ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉన్న ఈ మొత్తం సంఘ‌ట‌న అక్క‌డ ఉన్న కెమెరాల్లో స్ప‌ష్టంగా షూట్ అయ్యింది.

First Published:  13 Jan 2016 1:05 AM GMT
Next Story