Telugu Global
Others

పెద్ద రెడ్ల వల్లే పార్టీ మారడం లేదు?

రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంపై చాలా క్లారిటీతో ఉన్నట్టు కనిపిస్తోంది. పార్టీ మారడంపై, టీటీడీపీ మనుగడపై తాను ఎంత క్లారిటీతో ఉన్నది వెల్లడించారు రేవంత్. ఎన్ని కష్టాలు వచ్చినా తన ప్రయాణం టీడీపీతోనేనని స్పష్టం చేశారు. తాను అందరిలా మరొకరిపై ఆధారపడి రాజకీయాల్లో ఎదగాలనుకునే రకం కాదన్నారు. ముళ్లబాటలోనైనా సరే సొంత కాళ్లతోనే పరుగు తీస్తానన్నారు. కష్టాల్లో ఉన్న ఏపీని నిలబెట్టాల్సిన అవసరం చంద్రబాబుపై ఉందని అందుకే ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి పెద్దగా ఇన్వాల్వ్ కావడం […]

పెద్ద రెడ్ల వల్లే పార్టీ మారడం లేదు?
X
రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంపై చాలా క్లారిటీతో ఉన్నట్టు కనిపిస్తోంది. పార్టీ మారడంపై, టీటీడీపీ మనుగడపై తాను ఎంత క్లారిటీతో ఉన్నది వెల్లడించారు రేవంత్. ఎన్ని కష్టాలు వచ్చినా తన ప్రయాణం టీడీపీతోనేనని స్పష్టం చేశారు. తాను అందరిలా మరొకరిపై ఆధారపడి రాజకీయాల్లో ఎదగాలనుకునే రకం కాదన్నారు. ముళ్లబాటలోనైనా సరే సొంత కాళ్లతోనే పరుగు తీస్తానన్నారు. కష్టాల్లో ఉన్న ఏపీని నిలబెట్టాల్సిన అవసరం చంద్రబాబుపై ఉందని అందుకే ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి పెద్దగా ఇన్వాల్వ్ కావడం లేదన్నారు. తెలంగాణ రాజకీయాల్లో దిశానిర్దేశంచేసుకుని వెసులుబాటును చంద్రబాబు తమకు కల్పించారు. ”మీ సామాజికవర్గం మద్దతుగా ఉన్న కాంగ్రెస్‌పార్టీలోకి చేరవచ్చుకదా” అన్న ప్రశ్నకు రేవంత్ సమాధానంచెప్పారు. కాంగ్రెస్‌లో జైపాల్ రెడ్డి,జానారెడ్డి లాంటి హేమాహేమీలున్నారని అక్కడికి తాను వెళ్లి ఏం చేయగలనని ఎదురు ప్రశ్నించారు.
బీజేపీలోనూ రెడ్డి సామాజికవర్గానికిచెందిన పెద్దపెద్ద నేతలున్నారని చెప్పారు. తనకుతాను ఏదో గొప్పగా ఊహించుకుని… తన భుజం తాను చరుచుకుని కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లడం సరైనది కాదన్నారు. అసలు తెలంగాణలో రెడ్డి, కమ్మ కులాల మధ్య ఎలాంటి వివాదమే లేదు కదా అని ప్రశ్నించారు. రేవంత్ చెప్పేది కూడా ఒకరకంగా నిజమే. రెడ్డి అయినప్పటికీ కాంగ్రెస్‌లోకి వెళ్తే అక్కడి సీనియర్‌ నేతల రాజకీయాలకు నిలబడడం కష్టం. అదే టీడీపీలో అయితే తనకు పోటీ ఉండదన్న భావనతో రేవంత్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవిధంగా కాంగ్రెస్‌, బీజేపీలో రెడ్లు ఎక్కువైపోవడం వల్లే రేవంత్ టీడీపీలో ఉంటున్నారన్న భావన ఆయన వ్యాఖ్యల్లో వ్యక్తమైంది.
Click to Read:
making-of-follow-follow-son
jagan-junior-ntr
First Published:  10 Jan 2016 10:51 PM GMT
Next Story