Telugu Global
Cinema & Entertainment

మొన్న అనుష్క... నిన్న శృతిహాసన్... తాజాగా సమంత

కొరటాల శివ హీరోయిన్ల జాబితా ఇది. అతడు ఏ హీరోయిన్ ను సెలక్ట్ చేస్తే… ఆ భామకు స్టార్ డమ్ గ్యారెంటీ. సినిమా హిట్టవ్వడంతో పాటు హీరోయిన్ కు కూడా మంచి పేరొస్తోంది. మిర్చి సినిమాలో అనుష్కను, శ్రీమంతుడు సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్లుగా తీసుకున్న కొరటాల శివ… తాజాగా తన మూడో సినిమా జనతా గ్యారేజీ కోసం సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. నాన్నకు ప్రేమతో సినిమా విడుదలైన వెంటనే… దీనికి సంబంధించి […]

మొన్న అనుష్క... నిన్న శృతిహాసన్... తాజాగా సమంత
X
కొరటాల శివ హీరోయిన్ల జాబితా ఇది. అతడు ఏ హీరోయిన్ ను సెలక్ట్ చేస్తే… ఆ భామకు స్టార్ డమ్ గ్యారెంటీ. సినిమా హిట్టవ్వడంతో పాటు హీరోయిన్ కు కూడా మంచి పేరొస్తోంది. మిర్చి సినిమాలో అనుష్కను, శ్రీమంతుడు సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్లుగా తీసుకున్న కొరటాల శివ… తాజాగా తన మూడో సినిమా జనతా గ్యారేజీ కోసం సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. నాన్నకు ప్రేమతో సినిమా విడుదలైన వెంటనే… దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
హీరోతో పాటు హీరోయిన్ కు కూడా ఓ మేనరిజమ్, కాస్త స్టోరీ లింక్ చేసిపెట్టడం కొరటాల శివ హాబీ. మిర్చి సినిమాలో అనుష్క, రిచా గంగోపాధ్యాయకు మంచి రోల్స్ ఇచ్చాడు. తర్వాత శ్రీమంతుడు సినిమాలో కూడా శృతిహాసన్ కు మంచి పాత్ర కట్టబెట్టాడు. సో… జనతా గ్యారేజీలో కూడా నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రనే సమంతకు ఇస్తాడనడంలో సందేహం లేదు. అన్నట్టు ఈ సినిమాలో తారక్ సరసన తొలిసారిగా నిత్యామీనన్ కూడా నటించనుంది. అవును… జనతాగ్యారేజీలో సెకెండ్ హీరోయిన్ గా నిత్యాను తీసుకునే ఆలోచన కూడా కొరటాల మదిలో ఉంది.
First Published:  6 Jan 2016 3:13 PM GMT
Next Story