Telugu Global
Others

కర్నూలు ముఠా నాయకులపై సీఎం సెటైర్లు

కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలోని దీబగుండ్లలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు స్థానిక ముఠా కక్షలను ప్రముఖంగా ప్రస్తావించారు. కొందరు ముఠా నాయకుల వల్లే అన్ని ఉన్నా కర్నూలు జిల్లా అభివృద్ధి చెందలేదన్నారు. ”ఒకప్పుడు ఇక్కడ ముఠా నాయకులుండేవారు. ముఠాలు కట్టేవారు. కానీ ఇప్పుడు వారికి అవకాశం లేకుండా పోయింది. ముఠానాయకుల ఆటలు సాగడం లేదన్నారు. డబ్బు పెరిగిన తర్వాత ప్రాణాలకు విలువ పెరిగింది. దీంతో ముఠానాయకులకు మనుషులు దొరకడం లేదు. చీ కొట్టే పరిస్థితి వచ్చింది. […]

కర్నూలు ముఠా నాయకులపై సీఎం సెటైర్లు
X

కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలోని దీబగుండ్లలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు స్థానిక ముఠా కక్షలను ప్రముఖంగా ప్రస్తావించారు. కొందరు ముఠా నాయకుల వల్లే అన్ని ఉన్నా కర్నూలు జిల్లా అభివృద్ధి చెందలేదన్నారు. ”ఒకప్పుడు ఇక్కడ ముఠా నాయకులుండేవారు. ముఠాలు కట్టేవారు. కానీ ఇప్పుడు వారికి అవకాశం లేకుండా పోయింది. ముఠానాయకుల ఆటలు సాగడం లేదన్నారు. డబ్బు పెరిగిన తర్వాత ప్రాణాలకు విలువ పెరిగింది. దీంతో ముఠానాయకులకు మనుషులు దొరకడం లేదు. చీ కొట్టే పరిస్థితి వచ్చింది. అందుకే ముఠాలు కట్టడం మానేశారు” అని చంద్రబాబు అన్నారు.

కొందరు కర్నూలులో టీడీపీకి మూడుసీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి పట్టించుకోవడం లేదంటున్నారని…. కానీ తాను వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 14 స్థానాల్లోనూ గెలుపు సాధించాలన్న టార్గెట్ పెట్టుకున్నానని చెప్పారు. అందుకోసం ఎన్ని పనులైనా చేస్తామన్నారు. తన జీవితంలో అధైర్యం, నిరాశ అన్నవే లేవని చెప్పారు. నేర చరిత్ర ఉన్న ప్రతిపక్ష నాయకులు కూడా నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల్లాగే తాను వ్యవహరించి ఉంటే సభ రసాభాస అయ్యేదన్నారు. తాను మంచివాళ్లకు మంచివాడినని… చెడ్డవాళ్లకు, మొండివాళ్లకు జగమొండినని హెచ్చరించారు. తన దృష్టిలో రెండే కులాలున్నాయన్నారు. ఒకటి ధనికులు, రెండు పేదలు అని అన్నారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు.

First Published:  6 Jan 2016 5:35 AM GMT
Next Story