Telugu Global
NEWS

గ్రేటర్‌ ఎన్నికలపై NTv సర్వే ఫలితాలు

పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఎన్టీవీ-నీల్పన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్‌ కలిసి ఈ సర్వే నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌ 75 నుంచి 85 డివిజన్లలో విజయం సాధించనుంది. టీడీపీ- బీజేపీ కూటమికి 20 నుంచి 25 స్థానాలకు వస్తాయని సర్వే చెబుతోంది. కాంగ్రెస్‌ కేవలం 10 నుంచి 12 స్థానాలకు పరిమితం కానుంది. ఎంఐఎం మాత్రం 40 నుంచి 45 స్థానాలు గెలుచుకుంటుందని ఎన్టీవీ- నీల్సన్ సర్వే చెబుతోంది. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 […]

గ్రేటర్‌ ఎన్నికలపై NTv సర్వే ఫలితాలు
X

పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఎన్టీవీ-నీల్పన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్‌ కలిసి ఈ సర్వే నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌ 75 నుంచి 85 డివిజన్లలో విజయం సాధించనుంది. టీడీపీ- బీజేపీ కూటమికి 20 నుంచి 25 స్థానాలకు వస్తాయని సర్వే చెబుతోంది. కాంగ్రెస్‌ కేవలం 10 నుంచి 12 స్థానాలకు పరిమితం కానుంది. ఎంఐఎం మాత్రం 40 నుంచి 45 స్థానాలు గెలుచుకుంటుందని ఎన్టీవీ- నీల్సన్ సర్వే చెబుతోంది.

జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. సర్వేపై జరిగిన చర్చలో పాల్గొన్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ … గ్రేటర్ పరిధిలో టీఆర్‌ఎస్‌ బలం పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఖచ్చితంగా ఎన్ని సీట్లు వస్తాయో తాను చెప్పలేనని కానీ టీఆర్‌ఎస్‌కు ఎక్కువ స్థానాలు వస్తాయని లగడపాటి అంచనా వేశారు. అయితే ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మార్పు రావచ్చన్నారు. ఇదో తొందరపాటు సర్వే అని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.

First Published:  2 Jan 2016 7:48 PM GMT
Next Story