Telugu Global
Cinema & Entertainment

మరో సినిమా చూపించడానికి రెడీ

గతేడాది వచ్చిన చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సినిమా చూపిస్త మామ. రాజ్ తరుణ్-అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా చిన్నాపెద్దా అందర్నీ ఆకట్టుకుంది. దీంతో కొత్త ఏడాదిలో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో…. సినిమా చూపిస్త మామ-2 అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. లక్కీ మీడియా బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో రావు రమేష్ కీలకపాత్ర […]

మరో సినిమా చూపించడానికి రెడీ
X
గతేడాది వచ్చిన చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సినిమా చూపిస్త మామ. రాజ్ తరుణ్-అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా చిన్నాపెద్దా అందర్నీ ఆకట్టుకుంది. దీంతో కొత్త ఏడాదిలో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో…. సినిమా చూపిస్త మామ-2 అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. లక్కీ మీడియా బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో రావు రమేష్ కీలకపాత్ర పోషించగా… రాజ్ తరుణ్ ఆవారాగా కనిపిస్తాడు. ఈ సినిమా క్లైమాక్స్ నుంచి కథను మళ్లీ మొదలుపెడుతూ… పార్ట్-2 తీసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. సీక్వెల్ కు సంబంధించి ఇప్పటికే రాజ్ తరుణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కుమారి 21-ఎఫ్ సినిమాతో ఊపుమీదున్న ఈ కుర్రహీరో… త్వరలోనే వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అది కంప్లీట్ అయిన వెంటనే… సినిమా చూపిస్త మామ-2 సెట్స్ పైకి వస్తుంది.
First Published:  1 Jan 2016 7:04 PM GMT
Next Story