Telugu Global
Others

అఖిల ప్రియ ఎమ్మెల్యే కాదు

ఏపీ ప్రభుత్వ తీరు మరోసారి దుమారం రేపుతోంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేయడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం తాజాగా మరో ఊహించని తప్పు చేసింది. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే స్థానంలో టీడీపీ నేతలను ఎమ్మెల్యేను చేస్తూ జీవో జారీ చేశారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే ప్రత్యేక అభివృద్ధి నిధుల మంజూరులో ప్రభుత్వం ఈ తప్పు చేసింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి వైసీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రాతినిధ్యం […]

అఖిల ప్రియ ఎమ్మెల్యే కాదు
X

ఏపీ ప్రభుత్వ తీరు మరోసారి దుమారం రేపుతోంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేయడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం తాజాగా మరో ఊహించని తప్పు చేసింది. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే స్థానంలో టీడీపీ నేతలను ఎమ్మెల్యేను చేస్తూ జీవో జారీ చేశారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే ప్రత్యేక అభివృద్ధి నిధుల మంజూరులో ప్రభుత్వం ఈ తప్పు చేసింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి వైసీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అభివృద్ధి నిధులను టీడీపీ నేత గంగుల ప్రభాకర్‌ రెడ్డి పేరుతో విడుదల చేసింది. అంతేకాదు గంగుల ప్రభాకర్ రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అంటూ స్పష్టంగా జీవోలో పొందుపరిచారు. రెండు కోట్ల రూపాయలు ఆయన చెప్పినట్టు విడుదల చేశారు.

ఒక్క అఖిల ప్రియ విషయంలోనే కాదు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి కాగా టీడీపీ నేత శిల్పా చక్రపాణి ఎమ్మెల్యే అంటూ జీవో జారీ చేశారు. అయన పేరు మీద రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇలా అనేక నియోజకవర్గాల్లోనూ కోట్లాది రూపాయలను టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పేరు మీద విడుదల చేశారు. కర్నూలు జిల్లాలో ఏకంగా నాలుగు వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నిధులు టీడీపీ ఇన్‌చార్జ్‌ల పేరు మీద విడుదల చేశారు. గతంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రాతినిధ్యం వహించిన తునిలో వైసీపీ విజయం సాధించింది. ఇక్కడ కూడా యనమల రామకృష్ణుడి సోదరుడి పేరు మీద నిధులు విడుదల చేశారు. ప్రతి జిల్లాలోనూ ఇదే తంతుకు ప్రభుత్వం తెరలేపింది. దీన్నిచూసిన వారు దిగ్ర్భాంతికి గురవుతున్నారు. ప్రభుత్వం మరీ ఇంత తెగించి ఎలా ముందుకెళ్తోందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Go's

First Published:  1 Jan 2016 12:11 AM GMT
Next Story