Telugu Global
NEWS

కేసీఆర్‌ యాగంపై ముఖ్యమంత్రి సెటైర్లు

కేసీఆర్ చండీయాగంపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శలు చేశారు. యాగానికి శాస్త్రీయత ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమంటూ యాగాలు నిర్వహిస్తున్నారని..  అలా  చేసినంత మాత్రనా అభివృద్ధి జరుగుతుందా? అని ప్రశ్నించారు.  యాగాలు చేస్తే వర్షాలు కురుస్తుంటే ఈ దేశంలో కరువు చాయలే కనిపించేవి కాదన్నారు. యాగాలతోనే దేశం మొత్తం సుభీక్షం చేసే వారిమన్నారు. విద్యావంతులు కూడా ఇలాంటి విషయాలను గుడ్డిగా నమ్మడం బాధగా ఉందన్నారు. ఇటీవల కర్నాటకలో మూడ నమ్మకాలపై సిద్ధరామయ్య పెద్ద యుద్ధమే చేస్తున్నారు. […]

కేసీఆర్‌ యాగంపై ముఖ్యమంత్రి సెటైర్లు
X

కేసీఆర్ చండీయాగంపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శలు చేశారు. యాగానికి శాస్త్రీయత ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమంటూ యాగాలు నిర్వహిస్తున్నారని.. అలా చేసినంత మాత్రనా అభివృద్ధి జరుగుతుందా? అని ప్రశ్నించారు. యాగాలు చేస్తే వర్షాలు కురుస్తుంటే ఈ దేశంలో కరువు చాయలే కనిపించేవి కాదన్నారు. యాగాలతోనే దేశం మొత్తం సుభీక్షం చేసే వారిమన్నారు. విద్యావంతులు కూడా ఇలాంటి విషయాలను గుడ్డిగా నమ్మడం బాధగా ఉందన్నారు. ఇటీవల కర్నాటకలో మూడ నమ్మకాలపై సిద్ధరామయ్య పెద్ద యుద్ధమే చేస్తున్నారు. టీవీల్లో జోతిష్యం, రంగు రాళ్లు వంటి కార్యక్రమాలకు నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

First Published:  30 Dec 2015 3:44 AM GMT
Next Story