Telugu Global
Others

ఈ నిప్పు ఇప్పుడెందుకు రగిలింది?

బెజవాడలో వంగవీటి రాధ, దేవినేని నెహ్రు మధ్య ఇటీవల మాటల తుటాలు పేలుతున్నాయి. వీరి మధ్య పాతకాలం వైరం ఉన్నా ఇటీవల ఒకరికొకరు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. రంగా వర్ధంతి సందర్భంగా దేవినేని నెహ్రుపై రాధా తీవ్రస్థాయిలో విరుకుచుకుపడ్డారు. ”ముళ్లకంపలా అడ్డు ఉంటే తీసేస్తా, నరికేస్తా అంటున్నావ్… ఎంత మందిని తీసేస్తావ్, ఎంత మందిని నరుకుతావ్” అంటూ రాధా మండిపడ్డారు. తాము ఇప్పటికే చాలా నష్టపోయామని… మరోసారి నష్టపోయేందుకు కూడా సిద్ధమని సవాల్ విసిరారు. అయితే వీరి […]

ఈ నిప్పు ఇప్పుడెందుకు రగిలింది?
X

బెజవాడలో వంగవీటి రాధ, దేవినేని నెహ్రు మధ్య ఇటీవల మాటల తుటాలు పేలుతున్నాయి. వీరి మధ్య పాతకాలం వైరం ఉన్నా ఇటీవల ఒకరికొకరు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. రంగా వర్ధంతి సందర్భంగా దేవినేని నెహ్రుపై రాధా తీవ్రస్థాయిలో విరుకుచుకుపడ్డారు. ”ముళ్లకంపలా అడ్డు ఉంటే తీసేస్తా, నరికేస్తా అంటున్నావ్… ఎంత మందిని తీసేస్తావ్, ఎంత మందిని నరుకుతావ్” అంటూ రాధా మండిపడ్డారు. తాము ఇప్పటికే చాలా నష్టపోయామని… మరోసారి నష్టపోయేందుకు కూడా సిద్ధమని సవాల్ విసిరారు. అయితే వీరి మధ్య తాజా వివాదానికి కారణం వైసీపీలోకి వలస అంశమేనని చెబుతున్నారు.

విజయవాడలో బలమైన నేతగా ఉన్న దేవినేని నెహ్రును కూడా పార్టీలోకి చేర్చుకోవాలని జగన్ భావించారు. ఇందుకోసం చర్చలు కూడా జరిగాయి. నెహ్రు వైసీపీలో చేరిపోవడం ఖాయమని ప్రచారం కూడా జరిగింది. కానీ ఇంతలోనే వంగవీటి రాధా నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నెహ్రును పార్టీలోకి తీసుకునేందుకు రాధా ససేమిరా అంటున్నారు. నెహ్రు పార్టీలోకి వస్తే తమ దారి తాము చూసుకుంటామని తేల్చిచెప్పారట. ఈ నేపథ్యంలో దేవినేని నెహ్రు విషయంలో తాను ఎంత సీరియస్‌గా ఉన్నానో తెలియజేసేందుకే బహిరంగంగా నెహ్రుపై రాధా తీవ్ర వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. రాధా వ్యాఖ్యలు విన్న తర్వాత వైసీపీ నేతలు కూడా ఒక అంచనాకు వచ్చారట. నెహ్రును పార్టీలోకి తెస్తే రాధా బయటకు వెళ్లడం ఖాయమని అనుకుంటున్నారు. అందుకే పార్టీలోకి నేతల చేరికలపై వైసీపీ కూడా కాస్త వెనక్కు తగ్గిందని చెబుతున్నారు. రాధా, నెహ్రుల మధ్య తాజా వివాదం పార్టీలో చేరికల వరకే పరిమితమని … ఈ పరిణామం ఎటు దారి తీస్తుందోనని భయపడాల్సినంత సీరియస్‌ మ్యాటరేమీ కాదంటున్నారు.

Also Read బెజ’వార్‌’ – ఎవరిని నరుకుతావ్?, మరోసారి నష్టపోయేందుకూ రెడీ

vangaveeti-radha-nehru

First Published:  30 Dec 2015 3:04 AM GMT
Next Story