Telugu Global
Others

కూతురి కోసం రేవంత్ అంకోర్‌వాట్ టెంపుల్

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా వివాహం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 20న హైటెక్స్ లో జరగనున్న పెళ్లి వేడుకకు ఇప్పటికే చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తన గారాల కూతురు నైమిషా వివాహం ఆమెకు ఇష్టమైన రీతిలో జరిపించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అందుకు తగ్గట్టే రేవంత్ పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 20న జరగనున్న రేవంత్ రెడ్డి కూతురు వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబు సహా అన్ని […]

కూతురి కోసం రేవంత్ అంకోర్‌వాట్ టెంపుల్
X

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా వివాహం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 20న హైటెక్స్ లో జరగనున్న పెళ్లి వేడుకకు ఇప్పటికే చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తన గారాల కూతురు నైమిషా వివాహం ఆమెకు ఇష్టమైన రీతిలో జరిపించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అందుకు తగ్గట్టే రేవంత్ పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 20న జరగనున్న రేవంత్ రెడ్డి కూతురు వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబు సహా అన్ని పార్టీల ముఖ్య నేతలు హాజరు కానున్నారు.

కూతురు నైమిషా ఆలోచన మేరకే కల్యాణ మండపం డిజైన్ ను రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారట. మాస్టర్ ఆఫ్ సైన్స్ విద్యార్థి అయిన నైమిషాకు కాంబోడియాలోని అంకోర్ వాట్ దేవాలయం చూడాలన్న కోరిక చిన్పప్పటి నుంచి ఉండేదట. కానీ అది ఇప్పటివరకు సాధ్యం కాలేదు. అందుకే కూతురి కోరికను పెళ్లి మండపం రూపంలో తీర్చాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకే కల్యాణ మండపాన్ని అంకోర్ వాట్ దేవాలయం నమూనాను పోలి ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఆ బాధ్యతలను టాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డికి అప్పగించారు. కేవలం కల్యాణ మండపమే కాదు.. పెళ్లి పత్రికపైనా ఆలయ నమూనా ముద్రించినట్టు తెలుస్తోంది.

click to read:కేసీఆర్‌ను గీతారెడ్డి అంతపెద్ద పదవి అడిగారా?

150 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తులో అచ్చం ఆంకోర్ వాట్ ఆలయాన్ని పోలి ఉండేలా తీర్చి దిద్దుతున్నారు. కాంబోడియాలోని అంకోర్ వాట్ ఆలయం ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన కట్టడం. 12వ శతాబ్దంలో ఖెమెర్ రాజుల కాలంలో దీన్ని నిర్మించినట్టు చరిత్రలో ఉంది. 400 చదరపు కిలోమీటర్లలో దేవాలయ సముదాయాలను ఏర్పాటు చేశారు. మొత్తం మీద తన కూతురు నైమిషా పెళ్లి చూసిన వారు పెళ్లంటే ఇదిరా అని కలకాలం గుర్తుండిపోయేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు రేవంత్ రెడ్డి.

First Published:  17 Dec 2015 5:08 AM GMT
Next Story