Telugu Global
Cinema & Entertainment

బెంగాల్ టైగర్ ను పవన్ ఫ్యాన్సే చంపేశారా ?

ఇక్కడ మనం చెప్పుకుంటున్న బెంగాల్ టైగర్ ఏంటనేది సినీ ప్రేక్షకులందరికీ తెలిసిందే. కచ్చితంగా అది రవితేజ సినిమానే అని అందరూ అర్థం చేసుకుంటారు. కానీ ఆ సినిమాకు గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ కు సంబంధం ఏంటనే డౌట్స్ మాత్రం అందరికీ కాకపోయినా… కనీసం కొందరికైనా వస్తాయి. ఆ కొందరి కోసమే ఈ ఎనాలిసిస్. నిజానికి ఈపాటికి పవన్ కల్యాణ్, బెంగాల్ టైగర్ డైరక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో సినిమా రావాలి. కానీ అనుకోని కారణాల వల్ల […]

బెంగాల్ టైగర్ ను పవన్ ఫ్యాన్సే చంపేశారా ?
X
ఇక్కడ మనం చెప్పుకుంటున్న బెంగాల్ టైగర్ ఏంటనేది సినీ ప్రేక్షకులందరికీ తెలిసిందే. కచ్చితంగా అది రవితేజ సినిమానే అని అందరూ అర్థం చేసుకుంటారు. కానీ ఆ సినిమాకు గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ కు సంబంధం ఏంటనే డౌట్స్ మాత్రం అందరికీ కాకపోయినా… కనీసం కొందరికైనా వస్తాయి. ఆ కొందరి కోసమే ఈ ఎనాలిసిస్.
నిజానికి ఈపాటికి పవన్ కల్యాణ్, బెంగాల్ టైగర్ డైరక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో సినిమా రావాలి. కానీ అనుకోని కారణాల వల్ల (తెరవెనక కారణాల వల్ల అని కూడా అనుకోవచ్చు) ఆ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ ప్రాజెక్ట్ బాబి చేతుల్లోకి వెళ్లిపోవడం… సదరు సంపత్ నంది, బెంగాల్ టైగర్ ను పట్టాలెక్కించడం చకచకా జరిగిపోయాయి. అటు పవన్, ఇటు సంపత్ నంది ఆ విషయాలన్నీ ఎప్పుడో మరిచిపోయారు.(కనీసం మరిచిపోయారని అనుకుందాం). కానీ ఫ్యాన్స్ మాత్రం అప్పటి ఘటనను, ఆ రియలిస్టిక్ డ్రామాను మరిచిపోలేదు. అందుకే సమయం కోసం వేచి చూసి… తమ ప్రతాపాన్ని బెంగాల్ టైగర్ పై చూపించారని కొందరంటున్నారు.
బెంగాల్ టైగర్ విడుదలైన వెంటనే… మొట్టమొదటి నెగెటివ్ టాక్ పవన్ ఫ్యాన్స్ నుంచే వచ్చిందనేది అతిపెద్ద ప్రచారం. ఈ ప్రచారంలో నిజమెంతో మనకు తెలీదు కానీ… నష్టం మాత్రం భారీగానే జరిగిపోయింది. బెంగాల్ టైగర్, డే-వన్ నుంచి లాస్ వెంచర్ మార్క్ తోనే నడుస్తోంది. తాజాగా విడుదలైన లెక్కలు కూడా ఆ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. వీకెండ్ గడిచేటప్పటికీ బెంగాల్ టైగర్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 14 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. అంటే డిస్ట్రిబ్యూటర్ల కోణంలో చెప్పాలంటే… సినిమా ఇంకా సేఫ్ జోన్ లోకి ఎంటరవ్వలేదు. దీనంతటికీ కారణం పవన్ ఫ్యాన్సే అనే నెగెటివ్ ప్రచారం పరిశ్రమలో జోరుగా సాగుతోంది. కానీ అందులో వాస్తవం ఎంతనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.
First Published:  14 Dec 2015 7:02 PM GMT
Next Story