Telugu Global
Others

ఏపీకి ఇంటెలిజెన్స్ లేదా?

రాష్ట్రంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా ఆ విషయం ప్రభుత్వ పెద్దల దృష్ఠికి వెళ్లడం కామన్. ఇందుకు కారణం రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ. కిందస్థాయి నుంచి అత్యుత్తమ ప్రభుత్వ వర్గాల వరకూ ఏం జరుగుతోందో అని, అణునిత్యం ఇంటెలిజెన్స్ వర్గాలు కన్నేసి ఉంటాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తీవ్ర పరిణామాలను చూస్తుంటే ఆశ్చర్యానికి లోనుకాక తప్పని పరిస్థితి. అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు […]

ఏపీకి ఇంటెలిజెన్స్ లేదా?
X
రాష్ట్రంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా ఆ విషయం ప్రభుత్వ పెద్దల దృష్ఠికి వెళ్లడం కామన్. ఇందుకు కారణం రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ. కిందస్థాయి నుంచి అత్యుత్తమ ప్రభుత్వ వర్గాల వరకూ ఏం జరుగుతోందో అని, అణునిత్యం ఇంటెలిజెన్స్ వర్గాలు కన్నేసి ఉంటాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తీవ్ర పరిణామాలను చూస్తుంటే ఆశ్చర్యానికి లోనుకాక తప్పని పరిస్థితి. అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు ఏపీ మంత్రుల ఫోన్లను పక్క రాష్ట్రం తెలంగాణలో ట్యాప్ చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో చంద్రబాబు మొదట వేటు వేసింది అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై. అప్పట్లో అనురాధపై బదిలీ వేటును ఎవరూ పెద్దగా తప్పుపట్టలేదు. మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటి?
అప్పటి వరకు విజయవాడ సీపీగా ఉన్న తన సొంత సామాజికవర్గం అధికారి వెంకటేశ్వరరావును అనురాధ స్థానంలో చంద్రబాబు ఏరికోరి నియమించుకున్నారు. కానీ అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ పనితీరు పదేపదే చర్చనీయాంశమవుతూనే ఉంది. చిత్తూరు మేయర్ దంపతులను పట్టపగలు కాల్చిచంపేశారు. మేయర్ దంపతులకు, హంతకుడు చింటూకు మధ్య చాలా కాలంగా వైరం ఉందని, అది ఎంతదూరమైనా వెళ్లవచ్చని చిత్తూరు జనంకూడా చెప్పుకునే వారు. కానీ ఆ విషయాన్ని ఇంటెలిజెన్స్ గుర్తించడంలో విఫలమైందన్న విమర్శలు
వచ్చాయి. హత్యల ప్లాన్ గుర్తించడం కాస్త కష్టమే. కానీ విజయవాడలో కొన్ని నెలలుగా వ్యవస్థీకృతంగా సాగుతూ వందలాది మహిళల మానాన్ని మంటగలిపిన కాల్ మనీ- సెక్స్ రాకెట్‌ను ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు గుర్తించలేకపోయింది అన్నదే ఇప్పుడు ప్రభుత్వ వర్గాలకూ అంతుచిక్కని ప్రశ్న.
విజయవాడ అంటే ఏ మారుమూల ప్రాంతామో కాదు. ఏపీ రాజధాని ప్రాంతం. ముఖ్యమంత్రి, మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు నిత్యం నడియాడే నగరం. ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా అక్కడే ఉంటారు. మరి ఇంత దుర్మార్గమైన కాల్ మనీ దందా ఇంత స్వేచ్ఛగా ఎలా స్వైర విహారం చేయగలిగింది అన్నది ఇంటెలిజెన్స్ వర్గాలకే తెలియాలి!. పక్క రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్‌కు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌ను బాధ్యురాలిని చేసిన చంద్రబాబు మరి ఇప్పుడు ఎలా స్పందించాస్తారో చూడాలి!.
First Published:  14 Dec 2015 10:46 PM GMT
Next Story