Telugu Global
Others

నానిపై టీడీపీ మానసిక యుద్ధం!

ఎన్టీఆర్ సొంతనియోజకవర్గం గుడివాడలోనే పార్టీ ఓటమిని తెలుగుదేశం నాయకులు తొలినుంచి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నగారు పుట్టిన నియోజకవర్గంలో టీడీపీకి ఓటమా అంటూ మథనపడుతూనే ఉన్నారు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలినానికి ఉన్న పట్టు కారణంగానే వైసీపీ గెలుపు సాధ్యమైందన్నది అధికార పార్టీ నేతలు బలమైన భావన. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా గుడివాడలో తిరిగి జెండా పాతాలన్నది ఇప్పుడు యువనేత లోకేష్‌తో పాటు కృష్ణాజిల్లా టీడీపీ నేతలు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇందుకోసం కొడాలినానిని దెబ్బతీసే వ్యూహానికి తెరతీశారని చెబుతున్నారు. […]

నానిపై టీడీపీ మానసిక యుద్ధం!
X

ఎన్టీఆర్ సొంతనియోజకవర్గం గుడివాడలోనే పార్టీ ఓటమిని తెలుగుదేశం నాయకులు తొలినుంచి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నగారు పుట్టిన నియోజకవర్గంలో టీడీపీకి ఓటమా అంటూ మథనపడుతూనే ఉన్నారు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలినానికి ఉన్న పట్టు కారణంగానే వైసీపీ గెలుపు సాధ్యమైందన్నది అధికార పార్టీ నేతలు బలమైన భావన. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా గుడివాడలో తిరిగి జెండా పాతాలన్నది ఇప్పుడు యువనేత లోకేష్‌తో పాటు కృష్ణాజిల్లా టీడీపీ నేతలు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇందుకోసం కొడాలినానిని దెబ్బతీసే వ్యూహానికి తెరతీశారని చెబుతున్నారు.

ఇటీవల గుడివాడలో బలవంతంగా వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయడంతో పాటు కేసులు పెట్టి కొడాలినానిని అరెస్ట్‌ చేయించారు. ఇలా చేయడం ద్వారా నానిని లొంగదీసుకోవాలన్నది టీడీపీ నేతలు ఎత్తుగడగా చెబుతున్నారు. అయితే బెదిరింపులకు నాని లొంగే అవకాశాలు కనిపించడకపోవడంతో తెలుగు తమ్ముళ్లు కొత్త ప్లాన్ చేశారట. అదేంటంటే… కొడాలి నాని టీడీపీ దెబ్బకు మొత్తబడిపోయారంటూ లీక్‌లు వదలడం. అవకాశం ఇస్తే టీడీపీలో చేరేందుకు తాను సిద్ధమని కొడాలినాని అడుగుతున్నారంటూ కొందరు తెలుగు తమ్ముళ్లు కొందరు మీడియా ప్రతినిధుల వద్ద కావాలని పుకార్లు వదిలారు. టీడీపీ నేతల ఐడియాను కొన్ని మీడియా సంస్థలు బాగానే ప్రచారంలోకి తెచ్చాయని చెబుతున్నారు. ఈ వార్తలను సోషల్‌ మీడియాలోనూ బాగా ప్రచారం జరిగేలా జాగ్రత్తపడ్డారు. ఇలా చేస్తే ఏంటి లాభం అంటే అందుకు తెలుగుతమ్ముళ్లు కొన్ని లెక్కలు చెబుతున్నారు.

”కొడాలి పార్టీ మారుతున్నారన్న వార్తలు పదేపదే ప్రచారం జరిగితే… ఆయనపై వైసీపీ నాయకత్వంలోనూ ఏదో ఒక మూల అనుమానాలు చెలరేగడం ఖాయం. అలా అనుమానం మొదలైతే కీలక విషయాలను వైసీపీ నాయకత్వం నానితో పంచుకునే అవకాశం ఉండదు. అప్పుడు నాని మనసులోనూ వైసీపీ తనను పక్కనపెడుతోందన్న భావన కలుగుతుంది. దీని వల్ల పార్టీకి, నానికి మధ్య సంబంధాలు దెబ్బతింటాయి” అని కొందరు టీడీపీ ఎత్తును వివరిస్తున్నారు. చివరకు వైసీపీకి,నానికి మధ్య గ్యాప్‌ ఎంతవరకైనా వెళ్లవచ్చని చెబుతున్నారు. అయితే నాని వర్గీయులు మాత్రం కొత్త లెక్కలు కడుతున్నారు. కృష్ణా జిల్లా టీడీపీలో ఇప్పటికే చాలా మంది కమ్మసామాజికవర్గం నేతలున్నారు. ఒకవేళ నాని టీడీపీలోకి వెళ్లినా అక్కడ పెద్దగా ప్రాధాన్యత ఉండదని చెబుతున్నారు. అదే కష్టకాలంలోనూ వైసీపీలోనే ఉంటే భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే కమ్మసామాజికవర్గం కోటాలో మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద పార్టీ మారుతారంటూ నానిపై టీడీపీ మానసిక యుద్ధం చేస్తోందని ఆయన అనుచరులు అంటున్నారు.

Click to Read సెక్స్‌ రాకెట్‌ కీచక పర్వం- సంవత్సరీకం నాడు అత్యాచారాలే!

First Published:  12 Dec 2015 5:04 PM GMT
Next Story