Telugu Global
Others

బోడి మల్లన్న మాట " ఏపీకి పన్నుల రాయితీ కుదరదు

ఏరు దాటక ముందు ఓడ మల్లన్న… ఏరు దాటక బోడి మల్లన్న అన్నట్టుగా కేంద్రం తీరు ఉంది. ఎన్నికలకు ముందు ఏపీకి అది చేస్తాం ఇదిచేస్తామని గొప్ప గొప్ప హమీలు ఇచ్చిన కేంద్రం ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా నీరు గారుస్తూ వస్తోంది. ఏపీకి హిమాచల్ ప్రదేశ్ తరహాలో పన్నుల రాయితీ ఇవ్వడం కుదరదని పార్లమెంట్‌ వేదికగా ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్ తరహాలో ఏపీకి పన్నుల రాయితీ కల్పించే ప్రతిపాదనేది తమ వద్ద లేదని కుండబద్ధలు కొట్టింది. లోక్‌సభలో ఏపీకి […]

బోడి మల్లన్న మాట  ఏపీకి పన్నుల రాయితీ కుదరదు
X

ఏరు దాటక ముందు ఓడ మల్లన్న… ఏరు దాటక బోడి మల్లన్న అన్నట్టుగా కేంద్రం తీరు ఉంది. ఎన్నికలకు ముందు ఏపీకి అది చేస్తాం ఇదిచేస్తామని గొప్ప గొప్ప హమీలు ఇచ్చిన కేంద్రం ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా నీరు గారుస్తూ వస్తోంది. ఏపీకి హిమాచల్ ప్రదేశ్ తరహాలో పన్నుల రాయితీ ఇవ్వడం కుదరదని పార్లమెంట్‌ వేదికగా ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్ తరహాలో ఏపీకి పన్నుల రాయితీ కల్పించే ప్రతిపాదనేది తమ వద్ద లేదని కుండబద్ధలు కొట్టింది. లోక్‌సభలో ఏపీకి పన్నుల రాయితీ,ప్రత్యేక హోదా అంశంపై అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి జయంత్ సిన్హా, రావు ఇంద్రజిత్‌లు లిఖితపూర్వంగా సమాధానం చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని మరోసారి పరోక్షంగా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధించేందుకు కొన్ని అర్హతలు ఉండాలని గుర్తు చేశారు. అధికశాతం కొండలు, తక్కువ జనసాంద్రత లేదా అధిక గిరిజన జనాభా లేదా పొరుగు దేశాలతో సరిహద్దు లేదా ఆర్థికంగా తీవ్ర వెనుకుబాటుతనం ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా సాధ్యమని… ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చే ఆలోచన కూడా లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీనే కాకుండా తెలంగాణతో పాటు మరో ఏడు రాష్ట్రాలు ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తున్నాయని మరోసారి కేంద్రం పాత పాటే పాడింది

First Published:  11 Dec 2015 7:16 PM GMT
Next Story