Telugu Global
Others

చంద్రబాబు మన వెంట్రుక కూడా పీక్కోలేరు

బాక్సైట్ తవ్వకాల నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ జిల్లా చింతపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో ప్రతిపక్ష నేత జగన్ పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాక్సైట్ నెపాన్ని రాజశేఖర్‌ రెడ్డిపై నెట్టిందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆరేళ్ల క్రితం చనిపోయిన రాజశేఖరరెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడడం పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా మీరేం చేస్తారో చెప్పండని చంద్రబాబును నిలదీశారు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఎందుకు వేయడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం షెడ్యూలు 5లో ట్రైబల్ అడ్వైజరీ […]

చంద్రబాబు మన వెంట్రుక కూడా పీక్కోలేరు
X

బాక్సైట్ తవ్వకాల నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ జిల్లా చింతపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో ప్రతిపక్ష నేత జగన్ పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాక్సైట్ నెపాన్ని రాజశేఖర్‌ రెడ్డిపై నెట్టిందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆరేళ్ల క్రితం చనిపోయిన రాజశేఖరరెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడడం పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా మీరేం చేస్తారో చెప్పండని చంద్రబాబును నిలదీశారు.

ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఎందుకు వేయడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం షెడ్యూలు 5లో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ నియామకం తప్పనిసరి అన్నారు. కమిటీలో మూడొంతుల మంది గిరిజన శాసన సభ్యులు ఉండాలన్నారు.. కానీ రాష్ట్రంలో మొత్తం 7 గిరిజన ఎమ్మెల్యేలలో ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారని గుర్తు చేశారు. కమిటీ వేస్తే బాక్సైట్‌కు అనుకూలంగా నిర్ణయం రాదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు దాటవేత దోరణిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.

బాక్సైట్ వ్యతిరేక పోరాటంలో తాము అండగా ఉంటామని, అన్ని అనుమతులు చంద్రబాబు ఇచ్చినా ఒక తట్ట బాక్సైట్‌ను కూడా తవ్వనివ్వబోమని స్పష్టం చేశారు. వైసీపీతో పాటు గిరిజనులందరూ కలిసి పోరాడితే చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేడని జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు బుద్ది వచ్చే దాకా పోరాడదామని పిలుపునిచ్చారు. అయితే ”వెంట్రుక పీకలేరు” వంటి పదాలు వాడకుండా నేతలు మంచి పదాలతో విమర్శలు చేస్తే బాగుంటుంది.

First Published:  10 Dec 2015 7:17 AM GMT
Next Story