Telugu Global
National

కండల వీరుడికి విముక్తి .. ఫ్యాన్స్ సంబరాలు

హిట్‌ అండ్ రన్‌ కేసు నుంచి బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్ బయటపడ్డారు. 13ఏళ్ల నాటి ఈ కేసులో సల్మాన్‌ను నిర్ధోషిగా బొంబాయి హైకోర్టు ప్రకటించింది. సల్మాన్‌ నేరం చేశారని చెప్పేందుకు సరైన సాక్ష్యాలు లేవంటూ కోర్టు అభిప్రాయపడింది. బలమైన సాక్ష్యాలను చూపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చెప్పింది. ఇప్పుడున్న సాక్ష్యాల ఆధారంగా సల్మాన్‌ఖాన్‌ను దోషిగా ప్రకటించలేమని కోర్టు తేల్చిచెప్పింది. 2002 సెప్టెంబర్‌లో సల్మాన్‌ఖాన్ కారు రోడ్డుపక్కన పడుకున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా నలుగురు గాయపడ్డారు. […]

కండల వీరుడికి విముక్తి .. ఫ్యాన్స్ సంబరాలు
X

హిట్‌ అండ్ రన్‌ కేసు నుంచి బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్ బయటపడ్డారు. 13ఏళ్ల నాటి ఈ కేసులో సల్మాన్‌ను నిర్ధోషిగా బొంబాయి హైకోర్టు ప్రకటించింది. సల్మాన్‌ నేరం చేశారని చెప్పేందుకు సరైన సాక్ష్యాలు లేవంటూ కోర్టు అభిప్రాయపడింది. బలమైన సాక్ష్యాలను చూపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చెప్పింది. ఇప్పుడున్న సాక్ష్యాల ఆధారంగా సల్మాన్‌ఖాన్‌ను దోషిగా ప్రకటించలేమని కోర్టు తేల్చిచెప్పింది.

2002 సెప్టెంబర్‌లో సల్మాన్‌ఖాన్ కారు రోడ్డుపక్కన పడుకున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా నలుగురు గాయపడ్డారు. సల్మాన్‌ ఖాన్ తాగి కారు డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కేసు నమోదైంది. ఈ కేసులో దిగువ కోర్టు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ సల్మాన్‌ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయన ఊరట లభించింది. సల్మాన్‌ ఖాన్‌ కేసు నుంచి బయటపడిన విషయం తెలియగానే ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు.

First Published:  10 Dec 2015 3:29 AM GMT
Next Story