Telugu Global
Others

ఉమ్మడి వివాహ చట్టంపై 'పిల్’ తిరస్కరణ

ముస్లిం మహిళలు ఎదుర్కుంటున్న వివక్షను నివారించడానికి ఉమ్మడి వివాహ చట్టాన్ని తీసుకు రావాలని పార్లమెంటును ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని బెంచి ఈ విషయంలో చర్య తీసుకోవాల్సింది రాష్ట్రపతి అని స్పష్టం చేసింది. పార్లమెంటుకు ఆదేశం జారీ చేయడం సుప్రీం కోర్టు పరిధిలోని అంశం కాదని సుప్రీం కోర్టు బెంచి తెలియజేసింది. ఉమ్మడి వివాహ చట్టం ప్రస్తావన రాజ్యాంగంలోని ఆదేశిక […]

ఉమ్మడి వివాహ చట్టంపై పిల్’ తిరస్కరణ
X

ముస్లిం మహిళలు ఎదుర్కుంటున్న వివక్షను నివారించడానికి ఉమ్మడి వివాహ చట్టాన్ని తీసుకు రావాలని పార్లమెంటును ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని బెంచి ఈ విషయంలో చర్య తీసుకోవాల్సింది రాష్ట్రపతి అని స్పష్టం చేసింది. పార్లమెంటుకు ఆదేశం జారీ చేయడం సుప్రీం కోర్టు పరిధిలోని అంశం కాదని సుప్రీం కోర్టు బెంచి తెలియజేసింది.

ఉమ్మడి వివాహ చట్టం ప్రస్తావన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో 44వ అధికరణంలో ఉంది. ఆదేశిక సూత్రాలలో చేర్చిన అంశాల మీద న్యాయస్థానాలలో ఫిర్యాదు చేసే అవకాశం లేదు. మన దేశంలో వివిధ మతాల వారికి విభిన్నమైన వివాహచట్టాలు అమలులో ఉన్నాయి. వీటి స్థానంలో ఉమ్మడి వివాహ చట్టం రూపొందించడం వాంఛనీయమే అయినా ఇందులో అనేక సమస్యలు ఇమిడి ఉన్నందువల్ల, ముస్లింలకు వ్యతిరేకంగా ఉమ్మడి వివాహ చట్టాని ఎక్కుపెట్టినందువల్ల ఈ అంశం ఇప్పటికీ కొలిక్కి రాలేదు.

ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడాన్ని సుప్రీం కోర్టు తీవ్రమైన విషయంగా పరిగణిస్తుందని సుప్రీం కోర్టు బెంచి సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యానికి స్పష్టం చేసింది. అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

First Published:  6 Dec 2015 7:05 PM GMT
Next Story